హైదరాబాద్ వెస్ట్ జోన్‌లో సొంతింటి కోసం చూస్తున్నారా? ఐటీ హబ్‌లకు దగ్గరగా, విశాలమైన నివాసాలు, భారీ గ్రీన్ స్పేస్, అంతర్జాతీయ స్థాయి లైఫ్‌స్టైల్ సదుపాయాలతో కూడిన ఒక భారీ రెసిడెన్షియల్ టౌన్‌షిప్ ఇప్పుడు కొల్లూరు–వెలిమెల కారిడార్‌లో రూపుదిద్దుకుంటోంది. అదే ప్రెస్టీజ్ గ్రూప్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్.
ఈ ప్రాజెక్ట్‌లో ఏమున్నాయి? ఫ్లాట్ల సైజులు, అందులోని ఫెసిలటీస్ అండ్ ఎమినిటీస్, ఈ ప్రాజెక్టుకు కనెక్టివిటీ ఎలా ఉంది?
హైదరాబాద్ వెస్ట్రన్ ఐటీ కారిడార్‌కు సమీపంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు కొల్లూరు, వెలిమెల, తెల్లాపూర్. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్-2కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ఐటీ కేంద్రాలకు కనెక్టివిటీ ఉంది.
ఇదే ప్రాంతంలో ప్రెస్టీజ్ గ్రూప్ 28.6 ఎకరాల విస్తీర్ణంలో ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్ పేరుతో భారీ రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తోంది. ఎత్తైన అపార్ట్‌మెంట్ టవర్లు, విశాలమైన పార్కులు, ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్స్, వినోద సదుపాయాలు ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన ఆకర్షణలు.
పక్కనే ఉన్న ఇక్రిశాట్ క్యాంపస్ పచ్చదనం ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకత. ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్ ప్రాజెక్టులో మొత్తం 10 రెసిడెన్షియల్ టవర్లు ఉంటాయి. ప్రతి టవర్‌లో రెండు బేస్‌మెంట్ లెవల్స్, మూడు పోడియం ఫ్లోర్స్‌తో పాటు 52 పై అంతస్తులు ఉంటాయి. మొత్తం 5,120 అపార్ట్‌మెంట్లను నిర్మించనున్నారు. కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా 2, 3, 4 బీహెచ్‌కే ఇళ్లను అందిస్తున్నారు.
2 బీహెచ్‌కే క్లాసిక్ ఇళ్ల విస్తీర్ణం 1,169 నుంచి 1,281 చదరపు అడుగుల వరకు ఉంటుంది. 3 బీహెచ్‌కే ఆస్పైర్ ఇళ్లు 1,516 నుంచి 1,648 చదరపు అడుగులు, 3 బీహెచ్‌కే ప్రీమియా ఇళ్లు 1,837 నుంచి 2,162 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి.
ఇక 2,462 చదరపు అడుగుల 3 బీహెచ్‌కే అల్టిమా, 2,723 నుంచి 2,728 చదరపు అడుగుల 4 బీహెచ్‌కే సుప్రీమ్ ఇళ్లు కూడా ఉన్నాయి. అదనపు స్టాఫ్ అకామడేషన్‌తో 2,900 నుంచి 3,013 చదరపు అడుగుల 4 బీహెచ్‌కే అల్టిమా ఇళ్లను కూడా అందిస్తున్నారు.
ఇదీ చదవండి: దీపావళి తర్వాత టీ-స్క్వేర్‌కు గ్రీన్‌సిగ్నల్?
వావ్.. సెంట్రల్ పార్క్!
ఈ ప్రాజెక్ట్‌లో సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో సెంట్రల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్స్, ఓపెన్ స్పేసెస్, వాకింగ్ ట్రాక్స్ టౌన్‌షిప్ డిజైన్‌లో భాగంగా ఉన్నాయి. అపార్ట్‌మెంట్లలో సహజమైన వెలుతురు, గాలి ప్రసరణ, ప్రైవసీకి ప్రాధాన్యత ఇచ్చారు. నాలుగు వైపులా ఓపెన్ స్పేస్ ఉండేలా టవర్లను డిజైన్ చేశారు. సగానికి పైగా అపార్ట్‌మెంట్లు కార్నర్ యూనిట్లుగా డిజైన్ చేశారు. కొన్ని ఇళ్లలో ప్రైవేట్ డెక్స్, బాల్కనీలు కూడా ఉన్నాయి.
ఈ టౌన్‌షిప్‌లో రెండు మల్టీ లెవల్ క్లబ్‌హౌస్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సఫైర్, ఎమరాల్డ్ పేర్లతో ఏర్పాటు చేస్తున్న ఈ రెండు క్లబ్‌హౌస్‌ల మొత్తం విస్తీర్ణం సుమారు 1.5 లక్షల చదరపు అడుగులు. సఫైర్ క్లబ్‌హౌస్‌లో జిమ్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, స్పా, యోగా, పైలేట్స్ రూమ్స్, బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్టులు వంటి ఫిట్‌నెస్, స్పోర్ట్స్ సదుపాయాలు ఉంటాయి.
ఎమరాల్డ్ క్లబ్‌హౌస్‌లో బాంక్వెట్ హాల్, మినీ థియేటర్, కో-వర్కింగ్ స్పేస్, గెస్ట్ రూమ్స్, కేఫ్, క్లినిక్, ఫార్మసీ వంటి సదుపాయాలు కల్పించనున్నారు. వీటితో పాటు ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, పికిల్‌బాల్, పాడెల్ కోర్టులు, క్రికెట్ ప్రాక్టీస్ పిచ్, మినీ గోల్ఫ్, సైక్లింగ్, జాగింగ్ ట్రాక్స్ కూడా ఉంటాయి.
పిల్లల ఆట స్థలాలు, సీనియర్ సిటిజన్స్ పార్క్, పెట్ పార్క్, స్కేటింగ్ రింక్, పార్టీ లాన్, యాంఫీథియేటర్ వంటి సదుపాయాలను కూడా ప్రణాళికలో చేర్చారు.
ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్‌కు వెస్ట్రన్ ఐటీ కారిడార్ కనెక్టివిటీ కీలకమైన అంశం. ప్రాజెక్ట్ నుంచి నియోపోలిస్, కోకాపేట్ సుమారు 14 కిలోమీటర్లు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 16 కిలోమీటర్లు, గచ్చిబౌలి 18 కిలోమీటర్లు, హైటెక్ సిటీ 24 కిలోమీటర్ల దూరంలో ఉంది.
సమీపంలో గాడియం స్కూల్, బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, మంథన్ ఇంటర్నేషనల్ స్కూల్ వంటి విద్యాసంస్థలు ఉన్నాయి. సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్, ఐరావత హాస్పిటల్ వంటి వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, సోలార్ పవర్, మురుగునీటి శుద్ధి, ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి సస్టైనబిలిటీ చర్యలను ప్రాజెక్ట్‌లో ప్రతిపాదించారు.
ఈ ప్రాజెక్టుకు టీజీ రెరా రిజిస్ట్రేషన్ నంబర్ కూడా లభించింది. రిజిస్ట్రేషన్ ప్రకారం పూర్తి చేయాల్సిన తేదీ మార్చి 28, 2031. ధరల విషయానికి వస్తే, ప్రాజెక్ట్‌లో అపార్ట్‌మెంట్ల ప్రారంభ ధర సుమారు రూ.1.20 కోట్ల నుంచి ఉంటుంది. అయితే, ఇంటి విస్తీర్ణం, ఫ్లోర్, వ్యూ, కాన్ఫిగరేషన్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు.
మొత్తంగా చూస్తే, పెద్ద కమ్యూనిటీ, విశాలమైన గ్రీన్ స్పేస్‌లు, విభిన్న సైజుల్లో అపార్ట్‌మెంట్లు, విస్తృతమైన క్లబ్‌హౌస్ సదుపాయాలు కోరుకునే కుటుంబాలకు ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్ ఒక పరిశీలించదగిన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అయితే కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు ధరలు, నిర్మాణ పురోగతి, హ్యాండోవర్ తేదీ, టీజీ రెరా వివరాలను స్వయంగా తెలుసుకోవాలి.
ఇదీ చదవండి: వంద ఫీట్ల రోడ్డు.. సెవెన్ హిల్స్, మిడోస్ వాసుల్లో ఆందోళన
