ఆర్‌వీ క్రిషాంగ్ | ఆర్ఈజీ న్యూస్
దక్షిణ హైదరాబాద్ ప్రాంతంలో విమానాశ్రయ కారిడార్, ఐటీ ఉద్యోగ కేంద్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) పరిసరాల్లో విశాలమైన ఇళ్లు, ప్రశాంతమైన వాతావరణం, ఆధునిక సౌకర్యాలు కోరుకునే వారి కోసం విల్లా ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రావిర్యాలలోఆర్‌వీ క్రిషాంగ్ అనే గ్రీన్ లివింగ్ లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇందులోని 168 విల్లాలు.. పచ్చదనంతో కూడిన విలాసవంతమైన జీవనాన్ని అందిస్తుంది.
ఆర్‌వీ గ్రూప్‌లో భాగమైన ఆర్‌వీ గ్రీన్ హోమ్స్ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 14 సమీపంలో ఇది ఉంది. ఈ సంస్థకు 36 ఏళ్ల అనుభవంతో పాటు 60కి పైగా నివాస ప్రాజెక్టులను పూర్తి చేసిన చరిత్ర ఉంది. మొత్తం 19 ఎకరాల 31.5 గుంటల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
ఇందులో తూర్పు, పశ్చిమ ముఖంగా ఉండే విల్లాల్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్లాట్ విస్తీర్ణం 215 నుంచి 455 చదరపు గజాలకు పైగా ఉండగా, బిల్టప్ ఏరియా విషయానికి వస్తే.. 3,261 నుంచి 5,166 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు టీసీఎస్ ఆదిభట్ల, హార్డ్‌వేర్ పార్క్ సుమారు 3 కిలోమీటర్లు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
విల్లాల్లో బలమైన ఆర్‌సీసీ నిర్మాణం, ఎర్ర ఇటుక గోడలు, స్మార్ట్ లైట్లు, ఫ్యాన్లను మొబైల్ యాప్ ద్వారా నియంత్రించే సదుపాయం కల్పిస్తున్నారు. ఏసీలతో సహా 100 శాతం డీజిల్ జనరేటర్ విద్యుత్ బ్యాకప్, వీడియో ఇంటర్‌కామ్ భద్రత, ప్రతి విల్లా పార్కింగ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్ ఉంటాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 25 కేవీఏ సౌర విద్యుత్ వ్యవస్థ, ప్రతి విల్లాకు 200 లీటర్ల సోలార్ వాటర్ హీటర్, వర్షపు నీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.
శుద్ధి చేసిన నీటిని మొక్కలకు వినియోగించేలా ఏర్పాట్లు ఉన్నాయి. సేంద్రియ వ్యర్థాల నిర్వహణ సదుపాయం కూడా ఉంటుంది. ఐదు అంతస్తుల క్లబ్‌హౌస్‌లో రూఫ్‌టాప్ స్విమ్మింగ్ పూల్, జిమ్, యోగా, ధ్యాన గది, 25 మంది కూర్చునే హోమ్ థియేటర్, నాలుగు అతిథి గదులు ఉంటాయి. క్రికెట్ ప్రాక్టీస్ నెట్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులు, స్కేటింగ్ రింక్, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, పిల్లల ఆట స్థలాలు, పెట్ పార్క్, ఓపెన్ యాంఫీథియేటర్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.
తెలంగాణ రెరా నమోదు నంబర్ P02400007043. దక్షిణ హైదరాబాద్‌లోని ఐటీ, విమానాశ్రయ ప్రాంతాలకు సమీపంలో విశాలమైన ఇల్లు కోరుకునే కుటుంబాలు ఈ ప్రాజెక్టును పరిశీలించవచ్చు.
- ప్రాజెక్టు హైలెట్స్*
- ప్రాజెక్టు పేరు: ఆర్‌వీ క్రిషాంగ్
- తెలంగాణ రెరా నంబర్: P02400007043
- ప్రాంతం: రావిర్యాల-మహేశ్వరం, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 14 సమీపంలో
- భూమి విస్తీర్ణం: 19 ఎకరాల 31.5 గుంటలు
- మొత్తం విల్లాలు: 168 స్వతంత్ర ట్రిప్లెక్స్ విల్లాలు
- ప్లాట్ విస్తీర్ణం: 215 నుంచి 455 చదరపు గజాలకు పైగా
- నిర్మిత విస్తీర్ణం: 3,261 నుంచి 5,166 చదరపు అడుగులు
- ప్రత్యేకతలు: స్మార్ట్ హోమ్ సదుపాయాలు, 100% డీజీ బ్యాకప్, ఈవీ ఛార్జింగ్
- పర్యావరణ సదుపాయాలు: సౌర విద్యుత్, వర్షపు నీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి కేంద్రం
- క్లబ్‌హౌస్: స్విమ్మింగ్ పూల్, జిమ్, హోమ్ థియేటర్, నాలుగు అతిథి గదులు
- ఇతర సదుపాయాలు: క్రీడా ప్రాంగణాలు, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, పెట్ పార్క్, యాంఫీ థియేటర్
మరిన్ని వివరాలకు సంప్రదించండి
? 81870 68327, 95426 04289
