ఉత్తర హైదరాబాద్లో ప్రకృతికి దగ్గరగా, ప్రశాంతమైన వాతావరణంలో వ్యక్తిగత లగ్జరీ నివాసాలు కోరుకునే వారి కోసం.. మేడ్చల్‌లోని రావల్‌కోల్ మరో కీలక రియల్ ఎస్టేట్ గమ్యస్థానంగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో అన్విత గ్రూప్ మేడ్చల్ సమీపంలో ‘అన్విత పార్క్‌సైడ్’ పేరుతో భారీ విల్లా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది.
50 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం 270 విల్లాలున్నాయి. 4 బీహెచ్‌కే ట్రిప్లెక్స్ కాన్ఫిగరేషన్‌లో ఒక్కో విల్లాను 4,100 నుంచి 4,200 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో రూపొందిస్తున్నారు.
ఎన్‌హెచ్-44కు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్టుకు వెల్లింగ్టన్ రోడ్, రాజీవ్ రహదారి, మేడ్చల్–కొంపల్లి మార్గాల ద్వారా చేరుకోవచ్చు. జీనోమ్ వ్యాలీ, శామీర్‌పేట్ సరస్సు, కండ్లకోయ ఐటీ పార్క్ 10–15 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నాయి.
ఈ ప్రాజెక్టు ప్రత్యేకత పార్కులకు అభిముఖంగా ఉండే విల్లాల నిర్మాణం. విశాలమైన ల్యాండ్‌స్కేప్డ్ ఓపెన్ స్పేస్‌లు, 15కి పైగా రెసిడెన్షియల్ క్లస్టర్లు, ప్రత్యేక కమ్యూనిటీ ఫార్మింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుతం విల్లాలకు సంబంధించి నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయని సంస్థ విక్రయ ప్రతినిధి తెలిపారు. 2028 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి అప్పగించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది.
ఉత్తర హైదరాబాద్‌లోని ఉద్యోగ కేంద్రాలకు సమీపంగా విశాలమైన స్వతంత్ర నివాసాలు, పచ్చదనం, ప్రశాంతమైన జీవనశైలి కోరుకునే కుటుంబాలకు ఈ ప్రాజెక్టు ఆకర్షణీయమైన ఎంపికగా నిలవనుంది.
ఇదీ చదవండి: ఫ్యూచర్ సిటీకి మాస్టర్ ప్లాన్ రెడీ?
