General

మేడ్చ‌ల్‌లో లేక్‌ఫ్రంట్ విల్లా లివింగ్..  25 ఎకరాల్లో ‘ది బోట్ క్లబ్’ ప్రత్యేకతలు!

మేడ్చ‌ల్‌లో లేక్‌ఫ్రంట్ విల్లా లివింగ్..  25 ఎకరాల్లో ‘ది బోట్ క్లబ్’ ప్రత్యేకతలు!

స్వతంత్ర విల్లాలు, విశాలమైన నివాసాలు, ప్రశాంతమైన వాతావరణం కోరుకునే వారి కోసం ఉత్తర హైదరాబాద్‌లోని మేడ్చ‌ల్‌.. మరో ఆకర్షణీయమైన రియల్ ఎస్టేట్ గమ్యస్థానంగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో మేడ్చ‌ల్ సరస్సు సమీపంలో ‘ది బోట్ క్లబ్’ పేరుతో లేక్‌ఫ్రంట్ విల్లా ప్రాజెక్టు నిర్మాణం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

25 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో సుమారు 190 విల్లాలు ఉన్నాయి. 4, 5 బీహెచ్‌కే విభాగాల్లో ట్రిప్లెక్స్ డిజైన్లతో వీటిని నిర్మిస్తున్నారు. సుమారు 6,000 చదరపు అడుగులకు పైగా నిర్మాణ విస్తీర్ణం, 600 చదరపు గజాల వరకు ప్లాట్ సైజులతో విశాలమైన నివాసాలకు ప్రాధాన్యత ఇచ్చారు.

మేడ్చ‌ల్ చెరువును కేంద్రంగా చేసుకుని వాటర్‌ఫ్రంట్ సిటౌట్స్, ల్యాండ్‌స్కేప్డ్ బౌలేవార్డ్స్, వాకింగ్ జోన్లు, విశాలమైన ఓపెన్ స్పేస్‌లను ప్రణాళికలో భాగంగా రూపొందించారు. క్లబ్‌హౌస్‌లో స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, బిలియర్డ్స్, క్రీడా సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

జాగింగ్, సైక్లింగ్ ట్రాక్స్, యోగా జోన్లు, పిల్లల ఆట స్థలాలు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఎన్‌హెచ్-44, మెడ్‌చల్ చెక్‌పోస్ట్ రోడ్డుకు సమీపంలో ఉండటంతో కొంపల్లి, సుచిత్ర, శామీర్‌పేట్, జీనోమ్ వ్యాలీ ప్రాంతాలకు రాకపోకలు సులభం.

ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, 2026 డిసెంబర్ నాటికి విల్లాలను అప్పగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. విశాలమైన ఇళ్లు, వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌, సరస్సు పక్కన ప్రశాంతమైన జీవనశైలి కోరుకునే వారికి ‘ది బోట్ క్లబ్’ ఆకర్షణీయమైన ఎంపిక అని చెప్పొచ్చు.

ఇదీ చదవండి: