General

కొండాపూర్‌లో లగ్జరీ లివింగ్‌కు కొత్త అడ్రస్..  స్మార్ట్ టెక్నాలజీతో సైబర్‌సిటీ ట్రెవిటా!

కొండాపూర్‌లో లగ్జరీ లివింగ్‌కు కొత్త అడ్రస్..  స్మార్ట్ టెక్నాలజీతో సైబర్‌సిటీ ట్రెవిటా!

ఐటీ హబ్‌లకు దగ్గరగా, ప్రకృతి అందాల మధ్య, విశాలమైన ఇల్లు కావాలనుకునే వారి కోసం కొండాపూర్‌లో సరికొత్త ప్రీమియం నివాస ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది. బొటానికల్ గార్డెన్‌కు ఎదురుగా, కొత్తగూడ చెరువు అందాలను వీక్షించేలా సైబర్‌సిటీ ట్రెవిటా పేరుతో ఈ ప్రాజెక్ట్‌ను సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అభివృద్ధి చేస్తోంది. దీనికి టీజీ రెరా అనుమ‌తి ల‌భించింది.

6.53 ఎకరాల్లో మూడు టవర్లతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇందులో గ్రౌండ్ ప్లస్ 25 అంతస్తులతో మొత్తం 601 ఫ్లాట్లు  ఉంటాయి. 3, 4 బెడ్‌రూమ్‌లతో తొమ్మిది రకాల కాన్ఫిగరేషన్లలో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి.

వీటి విస్తీర్ణం 2,790 నుంచి 4,560 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ప్రాజెక్ట్‌లో 75 శాతం స్థలాన్ని ఓపెన్ స్పేస్‌లకు కేటాయించారు. ఈ ప్రాజెక్టులో 118 రకాల లైఫ్‌స్టైల్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఇదీ చదవండి: నాలుగు గోడలు కాదు.. మెరుగైన జీవనశైలిని అందిస్తున్నాం: శ్రీవర్ధన్ రెడ్డి

ప్రత్యేక సదుపాయాలు

మొత్తం 1.58 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్‌హౌస్, స్కై డెక్‌లు నిర్మిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్టులు, స్పా, పిల్లల ఆట స్థలం, పెట్ పార్క్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

అంతేకాదు.. ఓపెన్ ఎయిర్ సినిమా, స్కై డెక్, యోగా డెక్, టెర్రస్ కేఫ్ వంటి ప్రత్యేక ఆకర్షణలూ ఉన్నాయి. టెక్నాలజీ విషయంలోనూ ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఆర‌మ్ వాల్ట్స్ పేరుతో  బయోమెట్రిక్ సెక్యూరిటీ లాకర్లు, ఎలివేట్ పేరుతో రోబోటిక్ పార్సిల్ డెలివరీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

హైటెక్ సిటీకి ఐదు నిమిషాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు పది నిమిషాలు, శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌కు మూడు నిమిషాల దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంది. బొటానికల్ గార్డెన్‌కు కేవలం రెండు నిమిషాల నడక దూరం.

ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ ధ‌ర‌.. రూ.3.2 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. విశాలమైన ఇళ్లు, ఆధునిక సదుపాయాలు, స్మార్ట్ టెక్నాలజీ.. ఇలా ప్రీమియం జీవనశైలిని కోరుకునే కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని సైబర్‌సిటీ ట్రెవిటా రూపుదిద్దుకుంటోంది.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ