సాంకేతికత, సౌకర్యాలను రోజువారీ జీవితంలో భాగం చేసి, నివాసితుల జీవనాన్ని మరింత సులభంగా, సౌకర్యవంతంగా మార్చాలనుకుంటున్నాం. — శ్రీవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ – ఆపరేషన్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్
ఆర్ఈజీ న్యూస్
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఒకటైన కొండాపూర్‌లో కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టుల కోసం పెద్ద స్థలాలు లభించడం క్రమంగా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సుమారు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘సైబర్ సిటీ ట్రెవిటా’ అనే అల్ట్రా లగ్జరీ నివాస ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో 601 ఫ్లాట్లను అభివృద్ధి చేస్తున్నారు.
