General

కొల్లూరులో లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ విల్లాలు

కొల్లూరులో లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ విల్లాలు
  • ది మెజెస్టిక్ ప్రత్యేకతలివే

హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కొల్లూరులో మరో విలాసవంతమైన విల్లా ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల రియల్ ఎస్టేట్ అనుభవం కలిగిన గౌతమి డెవలపర్స్, ప్రత్యూష డెవలపర్స్ ఆధ్వర్యంలో ‘ది మెజెస్టిక్ లగ్జరీ విల్లాస్’ పేరుతో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. 7.1 ఎకరాల్లో కేవలం 45 ప్రత్యేక విల్లాలను నిర్మిస్తోంది.

ప్రతిపాదిత కొల్లూరు ఎస్ఈజెడ్‌కు సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టు నుంచి కొల్లూరు గేట్ 1.75 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 సుమారు 3.25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్క‌డ్నుంచి గండిపేట, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. ప్రతిపాదిత 100 అడుగుల రహదారి, 40 అడుగుల రోడ్డు ద్వారా కూడా రాకపోకలకు సౌకర్యం కల్పించనున్నారు.

ప్రతి విల్లా 477 నుంచి 524 చదరపు గజాల స్థలంలో, 6,700 నుంచి 6,900 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో రూపుదిద్దుకుంటోంది. ఐదు బెడ్‌రూమ్‌లు, లిఫ్ట్ సదుపాయం, వెట్ అండ్ డ్రై కిచెన్లు, సిబ్బందికి ప్రత్యేక గదులు ఇందులో ఉన్నాయి.

హోమ్ ఆఫీస్, హోమ్ థియేటర్ లేదా వ్యక్తిగత జిమ్ ఏర్పాటు చేసుకునేలా డిజైన్లు రూపొందించారు. సుమారు 10,000 చదరపు అడుగుల క్లబ్‌హౌస్, ఆధునిక సదుపాయాలు, ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేపింగ్ ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు. 

ఇప్పటికే కొన్ని విల్లాల్లో నిర్మాణ పనులు ప్రారంభమై స్లాబ్ దశకు చేరుకున్నాయి. 2026 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేసి, కొనుగోలుదారులకు అప్పగించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

కేవలం 45 విల్లాలకే పరిమితం కావడంతో విశాలమైన నివాసం, వ్యక్తిగత స్వేచ్ఛ‌, మెరుగైన కనెక్టివిటీ కోరుకునే వారికి ఈ ప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఇదీ చదవండి: రాజేంద్రనగర్‌లో తక్కువ సాంద్రతతో లగ్జరీ విల్లా కమ్యూనిటీ