General

శ్రీ ఆదిత్య స్క్వేర్స్‌కు టీజీ రెరా షాక్..  రూ.17 లక్షలు తిరిగి ఇవ్వాలని ఆదేశం

శ్రీ ఆదిత్య స్క్వేర్స్‌కు టీజీ రెరా షాక్..  రూ.17 లక్షలు తిరిగి ఇవ్వాలని ఆదేశం

ఇల్లు కొనుగోలు చేయాలని డబ్బులు చెల్లించి, నిర్మాణం ఆలస్యం కావడంతో వెనక్కి తగ్గిన కొనుగోలుదారుడికి టీజీ రెరా ఊరటనిచ్చింది. శ్రీ ఆదిత్య స్క్వేర్స్ సంస్థ రూ.17 లక్షలు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

వివ‌రాల్లోకి వెళితే.. శ్రీ ఆదిత్య స్క్వేర్స్‌ ప్రాజెక్టులో నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ఓ గృహ కొనుగోలుదారుడు తన బుకింగ్‌ను రద్దు చేసుకోవాలని కోరారు. డబ్బులు తిరిగి చెల్లిస్తామని సంస్థ హామీ ఇచ్చినప్పటికీ, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదు.

దీంతో బాధితుడు టీజీ రెరాను ఆశ్రయించారు. ఫిర్యాదును పరిశీలించిన అధికార యంత్రాంగం, కొనుగోలుదారుడికి రూ.17 లక్షలను వర్తించే వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సంస్థను ఆదేశించింది.

  • శ్రీ ఆదిత్య స్క్వేర్స్‌కు టీజీ రెరా ఆదేశాలు
  • కొనుగోలుదారుడికి రూ.17 లక్షలు రీఫండ్
  • వడ్డీతో సహా చెల్లించాలని ఉత్తర్వులు

ఇదీ చదవండి: ఇటుకలు, సిమెంట్‌ దాటి రియల్‌ పెట్టుబడులు