- 19 ఎకరాల్లో ఆర్‌వీ క్రిష్ణాంగ్ గ్రీన్ లివింగ్ హోమ్స్
హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ కారిడార్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రావిర్యాల్ ప్రాంతం విల్లా ప్రాజెక్టులకు కీలక గమ్యస్థానంగా మారుతోంది. ఈ క్రమంలో ఆర్‌వీ నిర్మాణ్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన ఆర్‌వీ గ్రూప్ ‘ఆర్‌వీ క్రిష్ణాంగ్ గ్రీన్ లివింగ్ హోమ్స్’ పేరుతో విలాసవంతమైన విల్లా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది.
ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 సమీపంలోని రావిర్యాల్‌లో 19 ఎకరాల 31.5 గుంటల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. మొత్తం 168 లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాలను నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో తూర్పు, పడమర ముఖంగా ఉండే విల్లాలు అందుబాటులో ఉన్నాయి. 215 నుంచి 455కు పైగా చదరపు గజాల ప్లాట్లలో, 3,261 నుంచి 5,166 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో వీటిని రూపొందించారు.
టీసీఎస్ ఆదిభట్ల, హార్డ్‌వేర్ పార్క్ సుమారు 3 కిలోమీటర్లు, అంతర్జాతీయ విమానాశ్రయం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
స్మార్ట్ లైటింగ్, వీడియో ఇంటర్‌కామ్, ఈవీ ఛార్జింగ్ పాయింట్లు, 100 శాతం జనరేటర్ బ్యాకప్ వంటి సదుపాయాల్ని కల్పిస్తున్నారు. సోలార్ విద్యుత్, వర్షపు నీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం వంటి పర్యావరణహిత సౌకర్యాల్ని పొందుపరిచారు.
ఐజీబీసీ ప్లాటినం సర్టిఫికేషన్ లక్ష్యంగా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. ఐదు అంతస్తుల క్లబ్‌హౌస్‌లో రూఫ్‌టాప్ స్విమ్మింగ్ పూల్, జిమ్, యోగా, హోమ్ థియేటర్, గెస్ట్ సూట్స్ ఉన్నాయి. క్రికెట్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, స్కేటింగ్, సైక్లింగ్, జాగింగ్ వంటి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు తెలంగాణ రెరాలో నమోదైంది. విశాలమైన స్వతంత్ర నివాసాలు, ఆధునిక జీవనశైలి, పర్యావరణహిత సదుపాయాలు కోరుకునే కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని రూపుదిద్దుకుంటోంది.
ఇదీ చదవండి: మోకిలాలో విశాలమైన ట్రిప్లెక్స్ విల్లాలు
