General

మోకిలాలో విశాలమైన ట్రిప్లెక్స్ విల్లాలు

మోకిలాలో విశాలమైన ట్రిప్లెక్స్ విల్లాలు
  •  పీఆర్ఆర్ వెనీషియా ప్రత్యేకతలివే

హైదరాబాద్ పశ్చిమ శివార్లలో ప్రశాంతమైన వాతావరణం, విశాలమైన నివాసాల కోసం చూస్తున్న వారికి మొకిలా మరో ప్రధాన గమ్యస్థానంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పీఆర్‌ఆర్ డెవలపర్స్ అభివృద్ధి చేస్తున్న ‘పీఆర్ఆర్ వెనీషియా’ ప్రీమియం విల్లా ప్రాజెక్టుగా ఆకర్షిస్తోంది.

9.02 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం 77 లగ్జరీ 4 బీహెచ్‌కే ట్రిప్లెక్స్ విల్లాలు ఉన్నాయి. 300, 350 చదరపు గజాల ప్లాట్లలో నిర్మిస్తున్న ఈ విల్లాలు వరుసగా 4,504, 5,250 చదరపు అడుగుల సూపర్ బిల్టప్ విస్తీర్ణంతో రూపొందించారు.

మోకిలా నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నియోపోలిస్, తెల్లాపూర్ ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ 5 కిలోమీటర్లు, ఎం మార్ట్ కేవలం 1 కిలోమీటరు దూరంలో ఉన్నాయి. విప్రో, మైక్రోసాఫ్ట్, ఐఎస్‌బీ, ఐఐఐటీ, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు కూడా సమీపంలోని ఉద్యోగ, విద్యా కేంద్రాలుగా ఉన్నాయి.

15,528 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్‌హౌస్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్, పార్టీ సెంటర్, యోగా, మెడిటేషన్ హాల్, లైబ్రరీ, గెస్ట్ రూమ్స్, ఇండోర్ గేమ్స్ వంటి సదుపాయాలు ఉంటాయి.

జాగింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలం, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, లాన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. విల్లాల్లో లిఫ్ట్ ఏర్పాటు చేసుకునే సౌకర్యం, జీవీటీ ఫ్లోరింగ్, అల్యూమినియం కిటికీలు, ప్రీమియం ఫినిషింగ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. పవర్ బ్యాకప్, నీటి శుద్ధి, మురుగునీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ, సీసీటీవీ నిఘా, 24 గంటల భద్రత వంటి సదుపాయాల్ని కల్పిస్తున్నారు.

తెలంగాణ రెరా (P02400008188)లో నమోదైన ఈ ప్రాజెక్టుకు హెచ్‌ఎండీఏ అనుమతి లభించింది. మోకిలా ప్రాంతంలో విశాలమైన నివాసం కోరుకునే కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. 

ఇదీ చదవండి: మేడ్చ‌ల్‌లో లేక్‌ఫ్రంట్ విల్లా లివింగ్