ఫ్లాట్‌ను ఒప్పందం ప్రకారం అప్పగించడంలో ఆలస్యం చేస్తే బిల్డర్ బాధ్యత వహించాల్సిందేనని టీజీ రెరా స్పష్టం చేసింది. వాసవి రియల్టర్స్ సంస్థ కొనుగోలుదారుడి నుంచి తీసుకున్న రూ.49.50 లక్షలపై ఏడాదికి 10.85 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది.
వాసవి రియల్టర్స్ ప్రాజెక్టులో ఫ్లాట్ నిర్మాణం పూర్తి చేసి, ఒప్పందం ప్రకారం కొనుగోలుదారుడికి అప్పగించడంలో ఆలస్యం జరిగింది.
ఈ వ్యవహారంపై విచారణ జరిపిన టీజీ రెరా, 2025 ఫిబ్రవరి 7 నుంచి వాస్తవంగా ఫ్లాట్‌ను అప్పగించే వరకు కొనుగోలుదారుడు చెల్లించిన రూ.49.50 లక్షలపై ఏడాదికి 10.85 శాతం వడ్డీ చెల్లించాలని సంస్థను ఆదేశించింది.
టీజీ రెరా జారీ చేసిన ఈ ఆదేశాలను పాటించకపోతే రెరా చట్టంలోని సెక్షన్ 63 ప్రకారం జరిమానాలు విధిస్తామని సంస్థలను హెచ్చరించింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో కొనుగోలుదారుల హక్కులను కాపాడేందుకు నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది.
- వాసవి రియల్టర్స్‌కు టీజీ రెరా ఆదేశాలు
- రూ.49.50 లక్షలపై 10.85% వడ్డీ
- ఫ్లాట్ అప్పగించే వరకు వడ్డీ చెల్లించాల్సిందే
ఇదీ చదవండి: మియాపూర్‌లో ఫ్లాట్ వెంటనే అప్పగించాలి
