General

ట్రంప్ ఎఫెక్టు.. పెరిగిన ప్ర‌వాసుల ఇళ్ల కొనుగోళ్లు..

ట్రంప్ ఎఫెక్టు.. పెరిగిన ప్ర‌వాసుల ఇళ్ల కొనుగోళ్లు..

క్రెడాయ్ నేష‌న‌ల్‌ జాయింట్ సెక్ర‌ట‌రీ, ఆర్‌వీ నిర్మాణ్ ఎండీ
చెరుకు రాంచంద్రారెడ్డి స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ..

(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌, కోల్‌క‌తా)

అమెరికాలో యంగ్ జ‌న‌రేష‌న్‌కి ప్రాబ్ల‌మ్ వ‌స్తుంది.. నాలుగైదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన‌వారిలో చాలామంది వెన‌క్కి వ‌చ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.. వ‌చ్చే ఒక‌ట్రెండేళ్ల‌లో హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చే వారిలో అధిక శాతం మంది త‌మ వ‌ద్ద ఫ్లాట్లు, విల్లాల్ని కొనుగోలు చేస్తున్నార‌ని క్రెడాయ్ నేష‌న‌ల్ జాయింట్ సెక్ర‌ట‌రీ, ఆర్‌వీ నిర్మాణ్ ఎండీ చెరుకు రామ‌చంద్రారెడ్డి తెలిపారు. ఆయ‌న కోల్‌క‌తా నాట్‌కాన్ 2026 సంద‌ర్భంగా ప్రాప‌ర్టీ ప‌ల్స్‌తో మాట్లాడుతూ.. అమెరికాలో ట్రంప్ ఆంక్ష‌లు, హెచ్1బీ వీసా స‌మ‌స్య‌లు, ఇటీవ‌ల 8 ఐటీ కంపెనీల‌పై అక్క‌డి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా.. ఎన్ఆర్ఐలు హైద‌రాబాద్‌కి వ‌చ్చేందుకు ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నారు. అలాంటి వారిలో ఇప్ప‌టికే కొంద‌రు త‌మ వ‌ద్ద ఇళ్ల‌ను కొనుగోలు చేశార‌ని వివ‌రించారు. మూడేళ్ల‌లో న‌గ‌రానికి విచ్చేస్తామ‌నే ఆలోచ‌న‌లున్న‌వారూ ఫ్లాట్ల‌ను తీసుకుంటున్నారు. ఇంకా ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే... 

కోల్‌క‌తాలో మెయింట‌నెన్స్ పెద్ద‌గా లేక‌పోయినా ర‌హ‌దారులు మెరుగ్గానే ఉన్నాయి. ఇక్క‌డ న‌గ‌రం హారిజాంట‌ల్‌గా అభివృద్ధి చెందిన‌ట్లు క‌నిపిస్తోంది. ఆకాశ‌హ‌ర్మ్యాలు పెద్ద‌గా లేవు. ఒక ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. కోల్‌క‌తాలోని ప‌లు కీల‌క ప్రాంతాల్లో ఉన్న ఆకాశ‌హ‌ర్మ్యాల్లో ఫ్లాట్ల ధ‌ర‌లు చ‌దర‌పు అడుక్కీ రూ.30,000 నుంచి రూ.35,000 చెబుతున్నారని స్థానిక బిల్డ‌ర్లు చెబుతున్నారు. దీంతో పోల్చితే మ‌న హైద‌రాబాద్‌లో స్కై స్క్రేప‌ర్ల‌లో ధ‌ర ఇంకా త‌క్కువ‌గా ఉంద‌నే చెప్పాలి. ఎందుకంటే, హైద‌రాబాద్ న‌గ‌రం అభివృద్ధి చెందినంత‌గా కోల్‌క‌తా డెవ‌ల‌ప్ అవ్వ‌లేదు. భాగ్య‌న‌గ‌రంతో పోల్చితే అక్క‌డ ప‌దిహేను, ఇర‌వై ఏళ్ల నుంచి ఇండ‌స్ట్రీయ‌ల్ గ్రోత్ పెద్ద‌గా లేదు. జాబ్ క్రియేష‌న్ ఎక్కువ‌గా జ‌ర‌గ‌లేదు. 

హైద‌రాబాద్ రియాల్టీలో విచిత్ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఒక‌ట్రెండు నెలలు ఫ్లాట్ సేల్స్ జ‌రిగితే.. మరో రెండు నెల‌లు కాస్త త‌గ్గుతున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. ఒక‌ట్రెండేళ్ల నుంచి న‌గ‌రంలో ఫ్లాట్ల ధ‌ర‌లూ పెద్ద‌గా అప్రిషీయేట్ అవ్వ‌లేదు. అందుకే, కొంద‌రు బ‌య్య‌ర్లు వేచి చూసే ధోర‌ణీని అవ‌లంభిస్తున్నారని అనిపిస్తోంది. హైద‌రాబాద్లో పెద్ద పెద్ద‌ ప్రాజెక్టులు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఇదివ‌ర‌కే ఆరంభ‌మైన ప్రాజెక్టులు, కొత్త‌గా లాంచ్ అయిన ప్రాజెక్టుల మ‌ధ్య అమ్మ‌కాల‌నేవి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. అందుకే, మార్కెట్ కొంత స్లో అయిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. కానీ, అనుకున్నంత‌గా ఫ్లాట్ల అమ్మ‌కాలు త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. కొనుగోలుదారుల్లో ఫ్లాట్ల ఎంపిక‌పై అవ‌గాహ‌న పెరిగింది. వారు ఇప్పుడు ప్రాజెక్టు ప్లానింగ్‌ని కూడా నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. ఈ క్ర‌మంలో 20 అంత‌స్తుల్లోపు మీడియం రైజ్ లో డెన్సిటి ప్రాజెక్టుల‌కు ప్రాధాన్య‌త పెరుగుతోంది. 

* నిర్మాణ సామ‌గ్రి ధ‌ర ఈ ఏడాదిలో గ‌ణ‌నీయంగా పెరిగింది. స్టీలు ఇర‌వై శాతం.. పీవీసీ, కాప‌ర్‌, అల్యూమినియంలో 15-20 శాతం అధిక‌మైంది. కొన్ని వ‌స్తులు ప‌ది శాతం పెరిగాయి. ఎల‌క్ట్రీక‌ల్ ఐటెమ్స్‌, రైజింగ్ మెయిన్స్, ప్యాన‌ల్ బోర్డుల్లో కొన్ని ప‌రిక‌రాల్లో కొర‌త పెరగడంతో వాటి రేట్లు ఊహించిన దానికంటే ఎక్కువ‌గా పెరిగాయి. మొత్తానికి, నిర్మాణ వ్య‌యం ప‌దిహేను నుంచి ఇర‌వై శాతం పెరిగింది. గ‌త ఆరు నెల‌ల్నుంచి కార్మికుల కొర‌త తీవ్రంగా ఉంది. ఫ‌లితంగా, నిర్మాణాలు పూర్తి చేయ‌డంపై ఒత్తిడి అధిక‌మైంది. ష‌ట్ట‌రింగ్ కార్మికులు బీహార్, చ‌త్తీస్‌ఘ‌డ్‌, జార్ఖండ్, ఒరిస్సా నుంచి వ‌చ్చేవారు. వెస్ట్ బెంగాల్ నుంచి వ‌చ్చే కార్మికులు స‌ర్ యాక్టివిటీ కార‌ణంగా స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోయి న‌గ‌రానికి తిరిగి రావ‌ట్లేదు. అక్క‌డే ప‌నుల్లో బిజీ అయిపోయారు. ఫ‌లితంగా, లేబ‌ర్ షార్టేజ్ విప‌రీతంగా పెరిగింది. మ‌హారాష్ట్ర నుంచి ఎల‌క్ట్రీషియ‌న్స్ రావ‌ట్లేదు. మొత్తానికి, నిర్మాణ వ్య‌యం ప‌దిహేను నుంచి ఇర‌వై శాతం అధిక‌మైంది. 

న‌లువైపులా అభివృద్ధి.. 

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. న‌గ‌రం నాలుగువైపులా అభివృద్ధి చెందుతోంది. బిల్డ‌ర్లు నాలుగువైపులా ప్రాజెక్టుల్ని చేప‌డుతున్నారు. నార్త్ హైద‌రాబాద్‌లో పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం పెరిగింది. భూముల ల‌భ్య‌త, ధ‌ర అందుబాటులో ఉండ‌టం వ‌ల్ల ద‌క్షిణ హైద‌రాబాద్‌లో విల్లా ప్రాజెక్టుల సంఖ్య అధిక‌మ‌వుతోంది. ప‌టాన్‌చెరులో బ‌డా ప్రాజెక్టులొస్తున్నాయి. ఔట‌ర్ రింగ్ రోడ్డు నుంచి  రాక‌పోక‌ల్ని సాగించే అవ‌కాశం ఉండ‌టం కాస్త బ‌డా ల్యాండ్ పార్శిళ్లు దొర‌క‌డం వ‌ల్లే ఆయా ప్రాంతాల్లో బిల్డ‌ర్లు కొత్త నిర్మాణాల్ని చేప‌డుతున్నారు. 

* హైద‌రాబాద్లో ఒక‌ప్పుడు సింగిల్ బెడ్‌రూముల‌ను ఎక్కువ‌మంది కొనేవారు. వాటిస్థానంలో డ‌బుల్ బెడ్‌రూముల్ని.. ఇప్పుడేమో ట్రిపుల్ బెడ్‌రూముల్ని కొనేవారి సంఖ్య పెరిగింది. ఒక ప్రాజెక్టులో 40 టూ బెడ్‌రూములు, 60 త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్ల‌ను బిల్డ‌ర్లు నిర్మిస్తే.. టూ బెడ్‌రూమ్ ఫ్లాట్లే అమ్మ‌కుండా మిగిలిపోతున్నాయి. అందుకే, చాలామంది త్రీ బెడ్‌రూం ఫ్లాట్ల‌ను నిర్మిస్తున్నారు. 

* 2023లో సొంతింటి ఎంపిక‌కు బ‌య్య‌ర్లు నాలుగు నుంచి ఆరు నెల‌లు తీసుకుంటే.. ఇప్పుడేమో ఒకట్రెండు నెల‌ల్లోనే తుది నిర్ణ‌యానికి వ‌చ్చేస్తున్నారు. సిస‌లైన కొనుగోలుదారులే ఇళ్ల‌ను కొంటున్నారు. గ‌త ఏడాది ఆరు నెల‌ల‌తో పోల్చితే ఈ సంవ‌త్స‌రంలో ఆరు నెల‌లు మెరుగ్గా ఉంది. ఇక పండ‌గ సీజ‌న్ వ‌చ్చేసింది.. మంచి రోజులు ఆరంభ‌మ‌య్యాయి కాబ‌ట్టి, ఫ్లాట్ల‌ను ఎంచుకోవ‌డానికి చాలామంది ముందుకొస్తున్నారు. 

ఫ్లాట్లు.. విల్లాలు.. లేఅవుట్లు.. 

మియాపూర్‌లో విజ‌య్ ఆర్‌వీ సాయి వ‌న‌మాలి ప్రాజెక్టులో సెకండ్ ఫేజును ప్రారంభించాం. కొండాపూర్ ప్రాజెక్టు ఫినిషింగ్ స్టేజీలో ఉంది. క‌ర్మ‌న్‌ఘాట్ హ్యాండోవ‌ర్ స్టార్ట్ చేశాం. 20 ఎక‌రాల్లో రావిర్యాలలో నిర్మిస్తున్న‌ విల్లా ప్రాజెక్టును వ‌చ్చే ఏడాది చివ‌రివ‌ర‌కూ హ్యాండోవ‌ర్ చేసే దిశ‌గా ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నాం. అందులో 168 విల్లాల్ని క‌డుతున్నాం. ఉద్యోగులు, ఎన్ఆర్ఐలు, మైగ్రేట్ అయ్యేవారు వీటిలో విల్లాల్ని కొంటున్నారు.

కిస్మ‌త్‌పూరా ఆర్‌వీ సంవ్రిత విల్లా ప్రాజెక్టు ప‌క్క‌నే 248 ఫ్లాట్ల‌ను క‌డుతున్నాం. కీస‌ర భోగారం వ‌ద్ద ఒక లేఅవుట్ 14 ఎక‌రాల్లో డెవ‌ల‌ప్ చేస్తున్నాం. క్రెడాయ్ టాప్ లీడ‌ర్‌షిప్ అద్భుతంగా నాట్‌కాన్ స‌ద‌స్సును నిర్వ‌హించారు. నాట్‌కాన్ లో ఎఐ స్టాల్స్ బాగున్నాయి. వాక్‌త్రూ త‌యారు చేసే సంస్థ‌లు పాల్గొన్నాయి. ఏఐతో మార్కెటింగ్ ఎలా చేయాలో తెల‌సుకోగ‌లిగాం. అభిషేక్ బ‌చ్చ‌న్‌, హ‌ర్ష‌వ‌ర్ద‌న్ వంటివారి సెష‌న్స్ బాగున్నాయి.