General
ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆకాశహర్మ్యం

ఇందులో పెంట్ హౌస్ ధర ఎంతో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆకాశహర్మ్యం ఎక్కడుందో తెలుసా? మన్ హట్టన్ లో ఉంది. దాని పేరు స్టెయిన్ వే టవర్. ఇక్కడ సన్నం అంటే చాలా నాజూగ్గా.. చాలా సన్నగా ఉంటుందని అర్థం కాదు. దాని ఎత్తు, వెడల్పు నిష్పత్తిని బట్టి అది సన్నమా కాదా అనేది నిర్ధారిస్తారు. 1400 అడుగుల ఎత్తున్న ఈ భవనం ఎత్తు, వెడల్పు నిష్పత్తి 24:1. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆకాశహర్మ్యంగా ప్రసిద్ధికెక్కింది. 2022లో నిర్మాణ పూర్తయిన ఈ భవనం 83 అంతస్తుల్లో ఉంటుంది. ఇందులో 80 నుంచి 83 అంతస్తుల వరకు నాలుగు అంతస్తుల్లో విస్తరించి ఉన్న క్వాడ్ ప్లెక్స్ పెంట్ హౌస్ అమ్మకానికి ఉంది.
దీని ధర 110 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 943 కోట్లు) ధర వింటేనే వామ్మో అనిపిస్తోంది కదూ? మరి ఆ పెంట్ హౌస్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది మరి. మొదటి అంతస్తులో “వినోదాత్మక సూట్”, రెండో అంతస్తులో బార్, స్క్రీనింగ్ రూమ్, మూడవ అంతస్తులో “ప్రైమరీ సూట్” ఉంటాయి. మొత్తం ఐదు బెడ్‌రూమ్‌లు, ఆరు బాత్రూమ్‌లు, రెండు టెర్రస్‌లు ఉన్నాయి.
ఇవి సెంట్రల్ పార్క్ వీక్షణతో సహా న్యూయార్క్ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూసే వెసులుబాటు కల్పిస్తాయి. స్టెయిన్‌వే టవర్ న్యూయార్క్ లోని బిలియనీర్స్ రో కంటే ఎత్తుగా ఉంటుంది. ఇది అల్ట్రా-లగ్జరీ ఆకాశహర్మ్యాల సముదాయం. ఇక్కడ సన్నని “పెన్సిల్ టవర్లు” ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపిస్తాయి. సమీపంలో ఉన్న సెంట్రల్ పార్క్ టవర్.. వరల్డ్ ట్రేడ్ సెంటర్ తర్వాత నగరంలో రెండవ ఎత్తైన భవనంగా ఉంది.
Related News
celebrity-homes
No articles available.
No posts available
No posts available