General

ద క్యాస్కేడ్స్ నియోపోలిస్‌కు ప్ర‌పంచంలోనే అరుదైన గుర్తింపు

ద క్యాస్కేడ్స్ నియోపోలిస్‌కు ప్ర‌పంచంలోనే అరుదైన గుర్తింపు
భార‌త‌దేశంలోనే ప్ర‌ప్ర‌థ‌మంగా వెల్- వీ2 ప్రీ స‌ర్టిఫికేష‌న్ పొందిన ప్రాజెక్టుగా ద క్యాస్కేడ్స్ నియోపోలిస్ అవ‌త‌రించింది. ఇదివ‌ర‌కే వివిధ దేశాల్లోని ప‌లు ప్రాజెక్టుల‌కు ఈ స‌ర్టిఫికెట్ ల‌భించినా.. ద క్యాస్కేడ్స్ నియోపోలిస్ మాత్రం ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా ఖ్యాతినార్జించ‌డం విశేషం. ఈ విష‌యాన్ని ఒక ప‌త్రికా ప్ర‌క‌ట‌న ద్వారా జీహెచ్ఆర్ ల‌క్ష్మీ అర్బ‌న్ బ్లాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ తెలియ‌జేసింది. వెల్‌నెస్ స‌ర్టిఫికేష‌న్ రావ‌డం వ‌ల్ల బ‌య్య‌ర్ల‌కు ప్ర‌యోజ‌నం ఏమిటంటే.. ఇందులో నివ‌సించేవారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ప్రాజెక్ట్ అని అర్థమ‌ని సంస్థ అంటోంది. ఈ ప్రాజెక్టు ఉట్టూ ఉన్న ఇంటి వాతావ‌ర‌ణం, నిర్మాణం అందులో నివ‌సించేవారిపై ఎలాంటి ప్ర‌భావం చూపుతుంద‌నే విష‌యాన్ని బ‌ట్టి ఈ గుర్తింపునిస్తార‌ని తెలియ‌జేసింది. అంతర్జాతీయ వెల్‌ బిల్డింగ్ ఇన్‌స్టిట్యూట్ (IWBI) అనే సంస్థ నుంచి WELL v2 ప్రీ-సర్టిఫికేషన్ ప్లాటినం అవార్డు ద క్యాస్కేడ్స్ నియోపోలిస్‌కు ల‌భించింది. జీహెచ్ఆర్ ల‌క్ష్మీ అర్బ‌న్ బ్లాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ‌.. హైద‌రాబాద్‌లోని కోకాపేట్‌లో 217 మీట‌ర్ల ఎత్తులో.. ద క్యాస్కేడ్స్ నియోపోలిస్ ప్రాజెక్టును ఇటీవ‌ల అట్ట‌హాసంగా ఆరంభించిన విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్ నిర్మాణ రంగంలోనే స‌రికొత్త ట్రెండ్‌ను సృష్టించిన జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా, ల‌క్ష్మీ ఇన్‌ఫ్రా, అర్బ‌న్ బ్లాక్స్ రియ‌ల్టీలు క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఎత్తు.. సుమారు 63 అంత‌స్తులు. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.3,169 కోట్ల దాకా ఉంటుంద‌ని సంస్థ విడుద‌ల చేసిన ఒక అధికారిక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది.

Related News

celebrity-homes

No articles available.

No posts available
No posts available