General

ఎల్ఆర్ఎస్ ఫీజు ఎలా చెల్లించాలి?

ఎల్ఆర్ఎస్ ఫీజు ఎలా చెల్లించాలి?
ద‌రఖాస్తు క్లియర్ అయ్యిందా! ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ఇంకా నత్తనడకనే కొనసాగుతోంది. దాదాపు ఏడాది కాలంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కొనసాగుతున్నా.. ఇంకా ఇరవై శాతం దరఖాస్తులు కూడా క్లియర్ కాలేదని అధికారిక వర్గాల అంటున్నాయి. మీరు ఎల్ఆర్ఎస్ కోసం ద‌రఖాస్తు చేసుకుని ఇంకా ఆమోదం పొందకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుని.. ప్రొసీజర్ ఫాలో అయితే వెంటనే ఎల్ఆర్ఎస్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. మరి ఎల్ఆర్ఎస్ త్వరితగతిన క్లియర్ అయ్యేందుకు ఏం చేయాలంటే.. ద‌రఖాస్తు పరిస్థితి ఇలా తెలుసుకోవాలి మీ ఎల్ఆర్ఎస్ కోసం చేసుకున్న దరఖాస్తుకు అధికారుల నుంచి అప్రూవ్ వస్తేనే ఛార్జీల వివరాలు ప్రభుత్వ అధికారి వెబ్ సైట్ (https://lrs.telangana.gov.in/layouts/CitizenLogin) లో డిస్ ప్లే అవుతాయి. లేకపోతే నో డేటా అని కనిపిస్తుంది. అప్రూవ్ అయిందా లేదా అనేది కూడా ఎల్ఆర్ఎస్ వెబ్ సైట్ లోనే తెలుసుకోవచ్చు. మీ దరఖాస్తుకు అప్రూవ్ వచ్చినట్లు ఉంటే.. ఫీజు వివరాలను తెలుసుకోవచ్చు. అంతే కాకుండా.. వెబ్ సైట్ లోనే సింపుల్ గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం లేదా ఇతర మార్గాల ద్వారా పేమెంట్ చేయొచ్చు.. ఎల్ఆర్ఎస్ ఫీజును ఇలా చెల్లించాలి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఎల్ఆర్ఎస్ తెలంగాణ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లగానే అఫీషియల్ లాగిన్, సిటిజన్ లాగిన్ కనిపిస్తుంది. ఇందులో మీరు సిటిజన్ లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి. మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నెంబరును ఎంట్రీ చేసి.. వెరిఫైడ్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోం పేజీలో LRS Plot Fee Payment, LRS Layout Fee Payment ఆప్షన్లు ఉంటాయి. మీరు దేనికైతే దరఖాస్తు చేశారో అందుకు అనుగుణంగా.. ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ వివరాలు కనిపిస్తాయి. దీంట్లోనే చివర్లో ఫీజు వివరాల ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇందులో రెగ్యులరైజేషన్ ఛార్జీలు, ఓపెన్ స్పేస్ ఛార్జీల వివరాలు కనిపిస్తాయి. పీడీఎఫ్ పక్కనే Fee Payment అనే ఆప్షన్ కూడా ఉంది. దీనిపై క్లిక్ చేసి మీ క్రమబద్ధీకరణ ఛార్జీలను చెల్లించవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటమే కాకుండా.. ఇతర మార్గాల ద్వారా ఈ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. పేమెంట్ ప్రాసెస్ పూర్తి కాగానే మీ చెల్లింపులకు సంబంధించి మరో డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. దీన్ని ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా పొందవచ్చు. పేమెంట్ వివరాలను జాగ్రత్తగా ఉంచుకోవటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. ఇతర అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. ఎల్ఆర్ఎస్ కు ఐదంచెల చెక్ లిస్ట్ అనధికార లేఅవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా రిజిస్ట్రేషన్లు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టం చేసింది. ఎల్ఆర్ఎస్ లో భాగంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసేందుకు ఐదంచెల చెక్ లిస్ట్ మేరకు ప్రాసెస్ జరుగుతుంది. ఈ చెక్ లిస్ట్ లోని అంశాలను లేఅవుట్ లేదా ప్లాట్ యజమాని ధృవీకరించాల్సి ఉంటుంది. ముందుగా ఆ లేఅవుట్ లో 2020, ఆగస్టు 26 నాటికి 10 శాతం మేర ప్లాట్ల విక్ర యాలు జరిగాయని నిర్ధారించుకునేందుకు గాను ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ల(ఈసీ)ను చెక్ చేయాలి. అదే విధంగా ప్రత్యేక ఫార్మాట్ లో సదరు 10 శాతం ప్లాట్ల వివరాలను ఇవ్వాలి. 10 శాతం ప్లాట్లు అమ్మిన అనంతరం లేఅవుట్ ప్లాన్ చెక్ చేయాలి. వీటితో పాటు ప్లాట్ లేదా లేఅవుట్ యజమానికి డిక్లరేషన్ ఇవ్వాలి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు నంబర్ తో పాటు ప్లాటు యజమాని ప్రభుత్వానికి చెల్లించిన మొత్తానికి రసీదును పరిశీలించిన అనంతరం రిజిస్ట్రేషన్ చేయాలా వద్దా అనే దానిపై సబ్ రిజిస్ట్రార్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేఅవుట్ యజమానులు ఇవ్వాల్సిన ప్రత్యేక ఫార్మాట్ లో జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్, లేఅవుట్ విస్తీర్ణం, లేఅవుట్ లోని మొత్తం ప్లాట్లు, క్రయ, విక్రయ లావాదేవీలు జరిగిన 10 శాతం ప్లాట్లకు సంబంధించి ప్లాట్ల నంబర్లు, రిజిస్టర్ డాక్యుమెంట్ నంబర్లు, సంవత్సరం, ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లావాదేవీ జరిగింది అనే వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.

Related News

celebrity-homes

No articles available.

No posts available
No posts available