ప్రాజెక్టు స్పెషాలిటీస్
- ప్రాజెక్ట్- ఎస్‌ఎంఆర్ వినయ్ ఐకానియా
- లొకేషన్- కొండాపూర్
- కంపెనీ- ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్
- టోటల్ ల్యాండ్ ఏరియా- 22 ఎకరాలు
- స్కై స్క్రేపర్ హైట్- 35 అంతస్థులు
- మొత్తం ఫ్లాట్స్- 2550
- యూనిట్ టైప్- 2, 3, 4 బీహెచ్‌కే
- యూనిట్ సైజ్- 1245-2925 చ.అ
- రెరా రిజిస్ట్రేషన్ నంబర్- P02400000069 P02400000195
లొకేషన్‌పరంగా కొండాపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు ఎందుకు..? నగరంలో బాగా డెవలప్ అయినా ఏరియాల్లో ఇప్పటికే టాప్‌లో ఉంది. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, సైబర్ టవర్స్, రహేజా మైండ్ స్పేస్ లాంటి ప్రధాన ఐటీ, ఎంఎన్‌సీలన్నీ కొండాపూర్ చుట్టు పక్కలే ఉన్నాయ్. అవాసా, ట్రైడెంట్, రాడిసన్, ద వెస్టిన్, నోవాటెల్ లాంటి లగ్జరీ హోటల్స్.. మెరిడియన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్రిడ్జ్, ఫీనిక్స్ గ్రీన్ ఇంటర్నేషనల్ స్కూల్, ఐఎస్‌బీ లాంటి ప్రముఖ విద్యా సంస్థలు.. ఇనార్బిట్ మాల్, ఎస్‌ఎల్‌ఎన్ టెర్మినస్ మాల్, సిటీ క్యాపిటల్ లాంటి రిటైల్ జోన్స్‌తో పాటు ఫేమస్ ఫైన్ డైనింగ్ అండ్ కేఫేస్.. ఇలా కొండాపూర్ సమీపంలోనే ఎన్నో సదుపాయాలున్నాయ్. కనెక్టివిటీకైతే ఢోకాయే లేదు. సో- లొకేషన్‌పరంగా ఎలాంటి ఇబ్బందులు లేని కొండాపూర్ లాంటి ప్రామినెంట్ ఏరియాలో ఉంది ఎస్‌ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్ట్.
నిర్మాణ రంగంలో ముచ్చటగా మూడు దశాబ్ధాల నుంచి కస్టమర్లకు విలువైన సేవలు అందిస్తుంది ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్. దక్షిణాదిలో పేరెన్నిక గల టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఈ సంస్థ. మేజర్ మెట్రో సిటీస్ అయిన బెంగళూర్, హైద్రాబాద్‌లో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ సెగ్మెంట్‌లో ఇప్పటికే ఎన్నో ప్రాజెక్ట్‌లు నిర్మించి వాటిని సక్సెస్‌ఫుల్‌గా క్లైయింట్స్‌కు అందించింది ఎస్‌ఎంఆర్. ఫైనాన్షియల్ స్టేటస్ అంటూ కొందరికే పరిమితం కాకుండా.. కస్టమర్ల ఆర్థిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గట్టు ప్రాజెక్ట్‌లు డిజైన్ చేయడం.. వీలైనంత వరకు బడ్జెట్‌లో అందించడం ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ ప్రత్యేకత.
ఎస్ఎంఆర్ రికార్డు ఇదే..
ఒక రంగంలో స్థిరపడి దశాబ్ధాలుగా నంబర్ వన్‌గా రాణించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ ఎప్పుడు రైజ్ అవుతుందో.. ఎందుకు డౌన్‌ఫాల్ అవుతుందో అర్థంకాని అన్‌సర్టైనిటీ ఉండే రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో. ఇలాంటి అనిశ్చిత రంగంలోనూ నిశ్చింతగా సేవలందిస్తూ కస్టమర్ల అభిమానాన్ని చూరగొంది ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్. థర్టీ ప్లస్ ఇయర్స్ ఎక్స్‌పీరియెన్స్‌తో రియాల్టీ అండ్ కన్‌స్ట్రక్షన్ సెక్టార్‌లో అద్భుతాలు చేస్తోంది ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్. టాప్ క్వాలిటీ కన్‌స్ట్రక్షన్, సమయానికి డెలివరీ చేయడం, అఫర్డబుల్ ప్రైసెస్‌లోనే వరల్డ్ క్లాస్ హోమ్స్‌ను అందించాలనే సంకల్పం, కస్టమర్ల విశ్వాసం.. వారి అభిప్రాయాలకు విలువనిచ్చి.. వారి అంచనాలకు మించి పని చేయాలనే లక్ష్యంతో పని చేస్తుంది కనుకే మార్కెట్లో నంబర్ వన్‌గా ఉన్నామంటోంది ఎస్‌ఎంఆర్ యాజమాన్యం. 82కి పైగా ప్రాజెక్ట్‌లు కంప్లీట్ చేసిన రికార్డ్.. 12 వేలకి పైగా హ్యాపీ ఫ్యామిలీస్ ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ సొంతం.ఎస్‌ఎంఆర్ వినయ్ ఐకానియాలో ఫస్ట్ అండ్ వెరీ వెరీ స్పెషల్‌గా చెప్పుకోవాల్సింది క్రికెట్ గ్రౌండ్ గురించి. గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఇండోర్ గేమ్స్ కోర్ట్స్ చాలా కామన్. కానీ వినయ్ ఐకానియాలో మాత్రం వీటంన్నిటితో పాటు ఎక్స్‌క్లూజివ్‌గా క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది. కొండాపూర్ లాంటి వాంటెడ్ లొకేషన్‌లో క్రికెట్ గ్రౌండ్ ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారా..? ఈ ఇంపాజిబుల్ థింగ్‌ను పాజిబుల్ చేసింది ఎస్‌ఎంఆర్ వినయ్ ఐకానియా. ఇప్పటివరకు హైద్రాబాద్‌లోని ఏ గేటెడ్ కమ్యూనిటీలో లేని సూపర్ ఎక్స్‌క్లూజివ్ ఫెసిలిటీ ఇది. ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేప్‌తో పాటుగా దేవాలయం, ప్రత్యేకమైన క్లబ్ హౌస్‌లు, క్రీడా వసతులు మొదలైనవి అభివృద్ధి చేశారు.
ఎస్‌ఎంఆర్ వినయ్ ఐకానియాలో జీ ప్లస్ ఫైవ్ క్లబ్‌హౌస్ ఉంది. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన ఈ క్లబ్‌హౌస్‌లో స్విమ్మింగ్‌పూల్స్, బాంకెట్ హాల్స్, బిలియర్డ్స్, టేబుల్ టెన్నిస్ లాంటి ఇండోర్ గేమ్స్, రూఫ్‌టాప్ టెన్నిస్ కోర్ట్, స్క్వాష్ కోర్ట్, రెండు బ్యాడ్మింటన్ కోర్టులు, ఏసీ జిమ్‌లు, ఫర్నిష్డ్ ఏసీ గెస్ట్ రూమ్‌లు, యోగా మెడిటేషన్ అండ్ ఏరోబిక్స్ హాల్, ప్లే స్కూల్, ఏటీఎమ్, కెఫేటేరియా, మల్టీపర్పస్ హాల్, స్పా, మినీ థియేటర్ ఉన్నాయ్. ఎలిగెంట్ ల్యాండ్ స్కేపింగ్, పార్క్స్ అండ్ ప్లే ఏరియాస్, యాంఫిథియేటర్, 75 శాతం ఓపెన్ స్పేస్, 24 గంటల వాటర్ సప్లై, త్రీ లెవల్ సెల్లార్ పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో విజిటర్స్ పార్కింగ్.. వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, సెంట్రలైజ్డ్ పైప్డ్ గ్యాస్ సిస్టమ్, 24 గంటల పవర్ బ్యాకప్ వసతులకు కొదువ లేదు.
ఓన్ ఫ్లాట్ ఇన్ వాంటెడ్ లొకేషన్.. గుడ్ విల్ ఉన్న టాప్ కంపెనీ కన్‌స్ట్రక్ట్ చేసిన గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలి అనుకునే వారికి వినయ్ ఐకానియాని మించిన బెస్ట్ ఆప్షన్ ఎంత వెదికినా దొరకదేమో. క్రికెట్ గ్రౌండ్ లాంటి ఎక్స్‌క్లూజివ్ ఫీచర్‌తో వరల్డ్‌క్లాస్ క్లబ్‌హౌస్ ఫెసిలిటీస్ ఉండటం.. బడ్జెట్‌లో ప్రైమ్ ఏరియాలో లగ్జరీ అపార్ట్‌మెంట్‌లు అందిస్తుంది కాబట్టే.. ఆకాశహర్మ్యాల విభాగంలోని టాప్ ప్రాజెక్ట్స్‌లో వినయ్ ఐకానియాని రెజ్ న్యూస్ బయ్యర్లకు రికమండ్ చేస్తోంది.