General
ఎస్ఎంఆర్ వినయ్ మాల్‌లో పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ ఆరంభం

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఎస్ఎంఆర్ వినయ్ మెట్రో మాల్‌లో ఐనాక్స్ మల్టీప్లెక్స్ శుక్రవారం ఆరంభమైంది. ఇందులో మొత్తం నాలుగు స్క్రీన్లలో 849 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో 49 ప్రీమియం లెథరైట్ రిక్లైనర్ల సీట్లున్నాయి. చూడగానే ఆకట్టుకునే ఇంటీరియర్లు, సౌకర్యవంతమైన సీటింగ్, పూర్తిగా లీనమై సినిమాను ఆస్వాదించాలని కోరుకునేవారికీ మల్టీప్లెక్స్ ఇట్టే నచ్చుతుంది.
ALSO READ: కూల్చేసిన సరిహద్దు గోడను హైడ్రా తిరిగి కట్టించాలి..!
ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ఎండీ ఎస్ రాంరెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ సినీ అభిమానుల్ని విశేషంగా నచ్చుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ఈడీ పృథ్వీరాజ్ రెడ్డి, సందీప్‌రెడ్డి, పీవీఆర్ ఐనాక్స్ థియేటర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
Related News
celebrity-homes
No articles available.
No posts available
No posts available