General
కొల్లూరులో ప్రీలాంచ్ మాఫియా!

కొల్లూరు, వెలిమల, పాటి ఘనపూర్, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రీలాంచ్‌లో ఆరంభించిన అనేక ప్రాజెక్టులు నేటికీ ఆరంభం కాలేదు. అప్పట్లో ధర తక్కువని.. అందులో చాలామంది పెట్టుబడి పెట్టారు. కాకపోతే, ఆయా నిర్మాణాలు ఆరంభం కాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు.
కొల్లూరులో తక్కువ ధరకే విల్లా అంటూ ఒక కంపెనీ కోట్ల రూపాయలను వసూలు చేసి.. ఆ తర్వాత చేతులెత్తేసింది. ఇందులో కొంతమంది అయితే అనుమతుల దశకూ వెళ్లలేదు. ఇంకొందరేమో, ఇతర నిర్మాణ సంస్థలకు ఆయా ప్రీలాంచ్ ప్రాజెక్టులను అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి, ఇన్వెస్టర్లు అయినా ఇంటి కొనుగోలుదారులైనా ఈ ప్రీలాంచుల్లో కొనేటప్పుడు కేవలం ధరను మాత్రమే చూడకుండా.. ఆయా బిల్డర్ ప్రాజెక్టును హ్యాండోవర్ చేయగలడా? లేదా? అనే అంశాన్ని క్షుణ్నంగా గమనించాకే అడుగు ముందుకేయండి.
ఎందుకంటే, ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను అమ్మేటప్పుడు ఆయా సంస్థకు చెందిన ఉద్యోగులు, ఏజెంట్లు, ఛానల్ పార్ట్‌నర్లు ఎంతో అప్యాయంగా మాట్లాడతారు. పలకరిస్తారు. ఒక్కసారి మీరు సొమ్మంతా కట్టేశాక.. తర్వాత క్రమక్రమంగా మీ ఫోన్లు కూడా ఎత్తేందుకు ఆసక్తి చూపించరు. ఇక, ఆ కంపెనీ ఓనర్ అయితే, మీరు ఎవరన్నట్లు చూస్తాడు. మీరు కలిసేందుకు ప్రయత్నించినా పెద్దగా పట్టించుకోడు. తనకేమాత్రం సంబంధం లేనట్లు వ్యవహరిస్తాడు. ఇప్పటికే, చాలామంది ప్రీలాంచ్ కొనుగోలుదారులకు ఈ విషయం అర్థమై ఉంటుంది. కాబట్టి, ప్రీలాంచుల్లో కొనేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. మీ కష్టార్జితానికి మీరే బాధ్యులు. గుడ్డిగా ముందుకెళ్లి మీ సొమ్మును బూడిదపాలు చేసుకోకండి.
Related News
celebrity-homes
No articles available.
No posts available
No posts available