- మొత్తం స్థలం.. 8.33 ఎకరాలు. 7 టవర్లు.. ఒక్కో టవర్ 17 అంతస్తులు
- ఫ్లాట్ల విస్తీర్ణం: 1010, 1400, 1655, 1725 చ.అ.లు
- 75 శాతం ఓపెన్ స్పేస్ లో అందమైన గ్రీనరీ
- హెచ్ఎండీఏ, రెరా అనుమతులొచ్చేశాయ్
- ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్టును మిస్ చేయవద్దు!
లొకేషన్ అడ్వాంటేజ్..
ప్రాజెక్టు ఉన్న లొకేషన్ పరంగా చూస్తే చాలా అడ్వాంటేజీలు ఉన్నాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఐటీ కారిడార్లకు అత్యంత సమీపంలో ముప్పా మెలోడీ ఉంది. ఇక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా దగ్గరే. ఆకర్షణీయమైన ధరలో అనువైన ప్రదేశంలో ఫ్లాట్ కావాలనుకునేవారికి ముప్పా మెలోడీని మించిన చాయిస్ లేదు. విశాలమైన పచ్చదనం, విలాసవంతమైన ల్యాండ్ స్కేపింగ్, చక్కగా నిర్మించిన వాకింగ్, జాగింగ్ ట్రాక్ లు.. ఇవన్నీ ప్రాజెక్టు మొత్తం విస్తీర్ణంలో మూడొంతులు. అంటే 75 శాతం ఓపెన్ ఏరియా అన్నమాట. ఫలితంగా తాజా గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, మరచిపోలేని అనుభూతి ముప్పా మెలోడీవాసుల సొంతం.లగ్జరీ సౌకర్యాలు..
అంతు లేని ఆనందం, తిరుగులేని సంతృప్తి, ముఖాలపై చెదరని చిరునవ్వు.. ఇవీ మెలోడీలో జీవించేవారు మరచిపోలేని అనుభూతులు. అత్యద్భుతంగా డిజైన్ చేసిన ఫ్లాట్లు, అదిరిపోయే సౌకర్యాలు, తిరుగులేని భద్రతా ప్రమాణాలు ముప్పా మెలోడీ సొంతం. క్లబ్ హౌస్ నుంచి సూపర్ మార్కెట్, ల్యాండ్ స్కేపింగ్, క్రీడా సౌకర్యాల వరకు మార్కెట్ లో ఉన్న అత్యుత్తమమైనవాటినే ఇందులో పొందుపరిచారు. 75 శాతం ఓపెన్ ఏరియా, గ్రీనరీతో కూడిన ఈ ప్రాజెక్టులో తాజా గాలి, సహజసిద్ధమైన వెలుతురు అన్ని గదులు, బాల్కనీల్లోకి వచ్చేలా దీనిని డిజైన్ చేశారు. భవనానికి, భవనానికి మధ్య చాలా ఖాళీ ఉంచడం వల్ల గాలీ వెలుతురు అన్ని చోట్లకూ ధారాళంగా వస్తుందన్నమాట. ఈ ప్రాజెక్టులో అల్యూమినియం ఫ్రేమ్ వర్క్ వినియోగిస్తున్నారు. దీనివల్ల మరింత ఖచ్చితమైన నాణ్యత పెరగడంతోపాటు బిల్డింగ్ జీవితకాలం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో బిల్డింగ్ నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుంది. సంప్రదాయ నిర్మాణంతో పోలిస్తే ఇందులో కార్పెట్ ఏరియా మరింత పెరుగుతుంది.రెండు క్లబ్ హౌజులు
ఒకటి అద్భుతం.. మరొకట అత్యద్భుతం.. ముప్పా మెలోడీలో రెండు క్లబ్ హౌసులు నభూతో నభవిష్యత్ అనే రీతిలో రూపుదిద్దుకుంటున్నాయి. 42000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో అదిరిపోయే సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. జిమ్, యోగా, ఇండోర్ గేమ్స్, బాంకెట్, పార్కింగ్, స్క్వాష్ కోర్టు, ఇండోర్ బ్యాడ్మింటన్ వంటి ఎన్నో సౌకర్యాలున్నాయి. ప్రపంచస్థాయి ప్రమాణాలు, అదిరిపోయే డిజైన్లు, బోలెడు సౌకర్యాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ విలాసవంతమైన ఫ్లాట్లు అందుబాటు ధరలోనే లభిస్తుండటం మరో అంశం. * బయ్యర్ల శారీరక ఫిట్ నెస్ కోసం ముప్పా మెలోడీలో బోలెడు క్రీడా సౌకర్యాలు కల్పిస్తున్నారు. జాగింగ్, వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్, క్రికెట్ ప్రాక్టీస్ పిచ్, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టు, మినీ స్కేటింగ్ రింక్, వాలీబాల్ కోర్టు, మినీ సాకర్, మల్టీ పర్పస్ కోర్టు, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, ఇండోర్ స్క్వాష్ కోర్టు, రాక్ క్లైంబింగ్, ఇండోర్ గేమ్స్ వంటి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కెఫెటీరియా కోసం టెర్రస్ పై స్పేస్ వదిలాం. క్రెష్, సూపర్ మార్కెట్, ఏటీఎం వంటివి అందించేందుకు స్థలాన్ని వదిలిపెట్టాం.బాధ్యతాయుతమైన జీవితం
అటు విలాసవంతానికి కాకుడా ఇటు బాధ్యతాయుతమైన జీవితానికి అర్థం చెప్పేలా ముప్పా మెలోడీలో పలు ఏర్పాట్లు చేస్తున్నారు. వేడినీళ్ల కోసం సౌరశక్తి వినియోగం, ఇంధన వనరులను సమర్థవంతంగా వినియోగించే వ్యవస్థలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, టొబాకో స్మోక్ కంట్రోల్, నిర్దేశిత ప్రదేశాల్లో సైకిల్ పార్కింగ్ సౌకర్యం, ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కోసం చార్జింగ్ పాయింట్ వంటివి ఇందులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ముప్పా మెలోడీకి వెళ్లండి. మీ జీవితాన్ని మెలోడీమయం చేసుకోండి.హ్యండోవర్ ఎప్పుడు?
టవర్లు ఏ మరియు బి: 2023 సెప్టెంబరు సీ మరియు డి టవర్లు: 2024 డిసెంబరు ఈ,ఎఫ్, జీ టవర్లు: ఇంకా ఆరంభించలేదుప్రస్తుత నిర్మాణ పరిస్థితి..
ఏ టవర్: 15వ ఫ్లోర్ శ్లాబు, ఈ నెలాఖరులోపు 17 ఫ్లోర్లు పూర్తి బి టవర్: 2వ ఫ్లోరు శ్లాబు సి టవర్: ఫుటింగ్ దశలో డి టవర్: గ్రౌండ్ ఫ్లోర్ శ్లాబురెండు దశాబ్దాల అనుభవంతో..
గత రెండు దశాబ్దాల నుంచి రియల్ రంగంలో మెరుగైన ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేస్తున్నాం. నాణ్యతలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.. ఆధునిక యువతీయువకులకు నప్పే లగ్జరీ సదుపాయాలు, సౌకర్యాల్ని అందజేస్తూ.. పలు ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుల్ని చేపట్టాం. లగ్జరీ అపార్టుమెంట్స్ అయినా విల్లా గేటెడ్ కమ్యూనిటీస్ అయినా మా ప్రత్యేకతను నిరూపించుకున్నాం. తాజాగా, తెల్లాపూర్‌లో ముప్పా మెలోడీ అనే బ్యూటీఫుల్ గేటెడ్ కమ్యూనిటీని ఆరంభించాం. భవిష్యత్తులో కొనుగోలుదారుల అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని.. సరికొత్త సౌకర్యాల్ని కల్పిస్తున్నాం. ముప్పా మెలోడి నిర్మాణ పనులు ప్రస్తుతం యమ జోరుగా జరుగుతున్నాయి.- ముప్పా వెంకయ్య చౌదరి, ఎండీ, ముప్పా గ్రూప్
