- ముంబై చెంబూర్ లో కొన్న మీర్జాపూర్ నటి శ్వేతా త్రిపాఠి
- మీర్జాపూర్ నటి శ్వేతా త్రిపాఠి ముంబై చెంబూర్ ప్రాంతంలో 940 చదరపు అడుగులు 3 బీహెచ్ కే అపార్ట్ మెంట్ ను రూ.3 కోట్లకు కొనుగోలు చేశారు.
సుప్రీం యూనివర్సల్ ప్రాజెక్ట్ అయిన సుప్రీం బౌలేవార్డ్ అనే భవనంలో ఈ ఫ్లాట్ ఉంది. 938 చదరపు అడుగుల వినియోగించదగిన విస్తీర్ణంలో ఉన్న అపార్ట్ మెంట్.. ఆ భంనలోని 9వ అంతస్తులో ఉంది. ఈ లావాదేవీ జూలై 2, 2025న రిజిస్టర్ కాగా.. రూ.15 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. మహారాష్ట్ర ప్రభుత్వం మహిళా గృహ కొనుగోలుదారులకు రాయితీలు అందించే విధానానికి అనుగుణంగా స్టాంప్ డ్యూటీ సడలింపు మంజూరైంది. ఈ అపార్ట్ మెంట్ కింద రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా వచ్చాయి.
శ్వేతా త్రిపాఠి 2018లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో గోలు గుప్తా పాత్ర ద్వారా చాలామందికి సుపరిచితం. త్రిపాఠి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్ ) నుంచి ఫ్యాషన్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పట్టా పొందారు.
నటనలోకి మారడానికి ముందు ప్రొడక్షన్ అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా తెరవెనుక తన కెరీర్‌ను ప్రారంభించారు. నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన మసాన్ (2015) సినిమాలో ఆమె అద్భుతమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత హరాంఖోర్, గోన్ కేష్, కార్గో వంటి సినిమాల్లో నటించారు.