General
రూ.512 కోట్లతో స్పేస్ కొన్న మైండ్ స్పేస్ రీట్

మైండ్ స్పేస్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్ (రీట్- ఆర్ఈఐటీ) హైదరాబాద్ లో 8.1 లక్షల చదరపు అడుగుల వాణిజ్య సముదాయాన్ని రూ.512 కోట్లకు కొనుగోలు చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో క్యూ సిటీని కలిగి ఉన్న మాక్ సాఫ్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ లో 100 శాతం ఈక్విటీ వాటాను మైండ్ స్పేస్ రీట్ సొంతం చేసుకుంది. ఈ లావాదేవీని హారిజన్‌వ్యూ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా చేపట్టామని కంపెనీ తెలిపింది. దీనిని ది స్క్వేర్, 110 ఫైనాన్షియల్ డిస్ట్రిక్టుగా రీబ్రాండ్ చేస్తామని వెల్లడించింది. ఈ కొనుగోలుతో హైదరాబాద్ లో మైండ్ స్పేస్ రీట్ పోర్ట్ ఫోలియో.. 16 మిలియన్ చదరపు అడుగులకు చేరింది.
* మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ సీఈఓ, ఎండీ రమేష్ నాయర్ మాట్లాడుతూ.. “ఇది మైండ్‌స్పేస్ వృద్ధి ప్రయాణంలో నిర్ణయాత్మక మైలురాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఈ క్యాంపస్, హైదరాబాద్‌లో మా స్థానాన్ని మరింత బలపరుస్తుంది’’ అని పేర్కొన్నారు. దేశంలో అత్యంత డిమాండ్ కలిగిన హబ్ గా హైదరాబాద్ అవతరిస్తోందని తెలిపారు. తాజా కొనుగోలుతో మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ పోర్ట్ ఫోలియో పరిమాణం 37.9 మిలియన్ చదరపు అడుగులకు పెరుగుతుంది. వీటిలో 30.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం పూర్తి కాగా, 3.7 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మాణంలో ఉంది. 3.4 మిలియన్ చదరపు అడుగులు భవిష్యత్ అభివృద్ధి కోసం సిద్ధంగా ఉంది.
Related News
celebrity-homes
No articles available.
No posts available
No posts available