- 30 శాతం ముందు కట్టండి
- మిగతాది నిర్మాణం తర్వాతే
- చదరపు అడుక్కీ రూ.5299
వెస్ట్ హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనాలంటే.. కొన్ని ప్రాజెక్టుల్లో.. అంతా కలుపుకుని లెక్కిస్తే.. చదరపు అడుక్కీ పదకొండు నుంచి పన్నెండు వేలు ఖర్చొస్తుంది. అంత ఖర్చును భరించ లేనివారు.. ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్న ఈస్ట్ హైదరాబాద్‌లోని పోచారాన్ని ఎంపిక చేసుకుంటే ఉత్తమం. కేవలం ఐటీ నిపుణులే కాదు.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేసేవారిని.. పోచారం విశేషంగా ఆకర్షిస్తోంది. ఎందుకంటే, ఇక్కడ చదరపు అడుక్కీ ఐదు నుంచి ఐదున్నర వేలకే ఫ్లాట్లు దొరుకుతున్నాయి.
ప్రస్తుతం ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి పోచారం వెళ్లేందుకు కనీసం అరగంట అవుతుంది. ట్రాఫిక్ జామ్ వల్ల ఇంకా ఎక్కువే సమయం పడుతోంది. కాకపోతే, ఉప్పల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చాక.. రవాణా సమయం గణనీయంగా తగ్గుతుంది. ఉప్పల్ మెట్రో నుంచి ఇన్ఫోసిస్‌కు పదిహేను నిమిషాల్లో ఇన్ఫోసిస్ కు చేరుకోవచ్చు. అందుకే, ప్రస్తుతం రేటు తక్కువగా ఉండటం వల్ల.. ఒకట్రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టులో ఇల్లు కొనుక్కోవడం ఉత్తమం. పెట్టుబడి నిమిత్తం లేదా అద్దెల నిమిత్తం అయినా, పోచారంలో కొనుక్కోవడం మంచి నిర్ణయమని చెప్పొచ్చు. మరి, అక్కడ ఏయే ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి?
ఉప్పల్ మెట్రో స్టేషన్ తర్వాత వచ్చే పీర్జాదిగూడ, పోచారంలో.. హరిహరా ఎస్టేట్స్ పలు ప్రాజెక్టుల్ని ప్రస్తుతం నిర్మిస్తోంది. నాణ్యతకు మారుపేరుగా నిలిచే ఈ సంస్థ.. గత మూడు దశాబ్దాల నుంచి ఈస్ట్ హైదరాబాద్లోనే ఎక్కువ ప్రాజెక్టుల్ని నిర్మించింది. పోచారంలో మూడు ఎకరాల్లో శ్రీ సాయి కాకతీయ అనే ప్రాజెక్టును నిర్మిస్తోంది.
ఇందులో 1335 చదరపు అడుగుల టూ బెడ్రూమ్ ఫ్లాట్ రూ.80 లక్షలకు దొరుకుతుంది. ఇందులో రూ.20 లక్షలు ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పెట్టుకుంటే.. అరవై లక్షలు బ్యాంకు రుణంగా తీసుకుంటే.. 15 ఏళ్ల రుణ వ్యవధికి నెలకు కనిష్ఠంగా సుమారు 55,100 నుంచి 59,800 కట్టాల్సి ఉంటుంది. అదే 20 ఏళ్లకు రూ. 47,800 నుంచి గరిష్ఠంగా రూ. 52,800 దాకా చెల్లించాల్సి వస్తుంది. మరెందుకు ఆలస్యం.. మీకు కావాలంటే ఈ సంస్థే మీకు బ్యాంకు రుణాన్ని కూడా అందించే ఏర్పాట్లు చేస్తుంది.
