- హైదరాబాద్‌లో అతిపెద్ద క్లబ్ హౌజ్
- రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రొవిన్షియా
- బయ్యర్లను ఆకర్షిస్తున్న క్లబ్ ఒడిస్సీ
తాను రాజపుష్ప ప్రాపర్టీస్ రెసిడెంట్ అని.. ఈ సంస్థతో మంచి అనుభవాలున్నాయని.. రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రొవిన్షియా ప్రాజెక్టులోని క్లబ్ ఒడిస్సీ పేరిట ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల్ని అందజేసిందని జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ అభిప్రాయపడ్డారు. ఇటీవల రాజపుష్ప ప్రాపర్టీస్ అభివృద్ధి చేసిన క్లబ్ ఒడిస్సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజపుష్ప ప్రొవిన్షియా ప్రాజెక్టులోకి ప్రవేశించగానే ఇక్కడి సదుపాయాలు, సౌకర్యాలు నచ్చాయని తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి హైదరాబాద్ గణనీయంగా అభివృద్ది చెందుతోందన్నారు. ఆరు ఏసీ బ్యాడ్మింటన్ కోర్టులు, బాస్కెట్‌బాల్ కోర్టులు, మోడ్రన్ జిమ్ వంటి ఆధునిక సదుపాయాల్ని ఈ ప్రాజెక్టులో పొందుపరిచారని తెలిపారు. ఇందులో నివసించే వారికి మధురాభూతిని కలిగించే రీతిలో ప్రాజెక్టును తీర్చిదిద్దారని కితాబునిచ్చారు.
ALSO READ: కొల్లూరులో ప్రీలాంచ్ మాఫియా!
రాజపుష్ప ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, "క్లబ్ ఒడిస్సీతో సంప్రదాయ రియల్ ఎస్టేట్‌కు మించి ఒక శక్తివంతమైన జీవనశైలి వ్యవస్థను సృష్టించామని తెలిపారు. ఇది కేవలం ఇళ్లను నిర్మించడమే కాకుండా, ఆరోగ్యం, అనుబంధాలు, మరియు రోజువారీ ఆనందాన్ని పెంపొందించే అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీలను నిర్మించాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రావిన్షియా అనేది భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే, ప్రీమియం జీవనం పట్ల మా విజన్ – ఇది ఇప్పుడు నిజమైంది" అని వివరించారు. క్లబ్ ఒడిస్సీతో జీవనశైలి పర్యావరణ వ్యవస్థను సృష్టించాం. ప్రొవిన్షియా ప్రాజెక్టు ప్రీమియం జీవనాన్ని అందిస్తుందని వివరించారు.
జి+39 అంతస్తులు.. 11 హైరైజ్ టవర్లు..
అటు ఆహ్లాదం.. ఇటు అద్భుత నిర్మాణం.. రెండూ కలగలిసిన ప్రీమియం లైఫ్ స్టైల్ హైరైజ్ అపార్ట్ మెంట్ ఇది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని నార్సింగిలో 23.75 ఎకరాల సువిశాల స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జి+39 అంతస్తులతో 11 హైరైజ్ టవర్లు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. 1370 చదరపు అడుగుల నుంచి 2660 చదరపు అడుగుల మధ్యలో 2, 3 బీహెచ్ కే ప్రీమియం లైఫ్ స్టైట్ అపార్ట్ మెంట్లు అందుబాటులోకి రానున్నాయి. 1370 చదరపు అడుగుల్లో 2 బీహెచ్ కే ఉండగా.. 1715, 2020, 2335, 2660 చదరపు అడుగుల్లో 3 బీహెచ్ కే అపార్ట్ మెంట్లు లభిస్తాయి.
అన్ని వయసుల వారికీ అవసరమైన సౌకర్యాలను ఇందులో పొందుపరిచారు. ఎక్స్ టీరియర్, ఇంటీరియర్ డిజైన్లు ఆహా అనిపించే రీతిలో ఉన్నాయి. ఇండోర్, ఔట్ డోర్ ఫిట్ నెస్ స్టేషన్, క్రెష్, క్లినిక్, ఫార్మసీ, గ్రాసరీ, ఏటీఎం, డబుల్ హైటెడ్ బాంకెట్ హాల్, హీలింగ్ గార్డెన్, యోగా, ఏరోబిక్స్ డెక్, యాంఫీ థియేటర్, స్విమ్మింగ్ పూల్, వెయిటింగ్ లాంజ్ తో స్కూల్ బస్ బే, పిల్లల ఆటస్థలం, రెస్టారెంట్, కాఫీ షాప్, 1.3 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, టోడ్లర్ల కోసం క్రియేటివ్ స్టూడియో, ఎంట్రన్స్ లో స్కైవాక్ వంటి సౌకర్యాల్ని పొందుపరుస్తారు.