హైదరాబాద్ నిర్మాణ రంగంలో విశేష అనుభవం గల వంశీరామ్ బిల్డర్స్ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టే.. వంశీరామ్ మన్‌హట్టన్ ఎట్ కాజాగూడ నియర్ గచ్చిబౌలి. హైదరాబాద్‌లో ఈ ఏడాది హ్యాండోవర్‌కు సిద్ధమవుతున్న అత్యంత ఎత్తయిన స్కై స్క్రేపర్.. సాస్ క్రౌన్ ఎట్ కోకాపేట్. ఎల్‌బీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద రూపుదిద్దుకుంటున్న.. వాసవి ఆనంద నిలయం.. సౌతిండియాలోనే అతి పెద్ద స్కై స్క్రేపర్ గేటెడ్ కమ్యూనిటీ. కొండాపూర్‌లో ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ నిర్మిస్తున్న స్కై స్క్రేపరే.. ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా. ల్యాంకోహిల్స్ చేరువలోని పొప్పాల్‌గూడలో.. టీమ్ ఫోర్ లైఫ్ స్పేసెస్ ఆరంభించిన సరికొత్త ఆకాశహర్మ్యమే.. టీమ్ ఫోర్ ఆర్కా. మరి, ఈ వారం మా.. హైదరాబాద్ టాప్ స్కై స్క్రేపర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ 2025 సెగ్మెంట్‌లో.. ఈ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన స్పెషల్ స్టోరీని ఇప్పుడు చూసేద్దామా..
స్టన్నింగ్ ప్రాజెక్ట్: వంశీరామ్ మన్‌హట్టన్
హైదరాబాద్‌లో ఊబర్ లగ్జరీ లివింగ్ లైఫ్ స్టయిల్‌ను కోరుకునే వారి కోసం రూపుదిద్దుకుంటున్న అత్యుత్తమ ప్రాజెక్టే.. వంశీరామ్ మన్‌హట్టన్. మరో పదేళ్ల వరకూ హైదరాబాద్‌లో ఇలాంటి లొకేషన్‌లో.. ఇంత హై క్వాలిటీ స్టాండర్డ్స్ మరే ప్రాజెక్టు రాదని.. ఘంటాపథంగా చెబుతున్నారు. విలావంతమైన జీవనంలో ఓ కొత్త పరిణామాన్ని పరిచేయం చేసే ఉద్దేశంతో మన్ హట్టన్ ప్రాజెక్టుని ప్రారంభించింది. 15 ఎకరాల్లో.. 8 టవర్లతో 978 యూనిట్లను అదిరిపోయే విధంగా నిర్మిస్తోంది. 2011 చదరపు అడుగుల నుంచి 14,099 చదరపు అడుగుల సైజులో.. 3, 4, 5 బీహెచ్ కే ఫ్లాట్లను నిర్మిస్తోంది. 2029 మార్చి నాటికి పూర్తి చేసే సంకల్పంతో ఎక్కడా రాజీపడకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతోంది. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సమస్త సౌకర్యాలతో ఓ క్లబ్ హౌస్‌ను నిర్మిస్తోంది.
రెడీ టు కంప్లీట్: సాస్ క్రౌన్ @ కోకాపేట్
హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యమే సాస్ క్రౌన్. జి ప్లస్ 57 అంతస్తుల ఎత్తయిన ఈ స్కై స్క్రేపర్.. కోకాపేట్ సర్వీస్ రోడ్డు మీద ఎంతో ఠీవీగా నిలబడుతూ దర్శనమిస్తుంది. 58 అంతస్తుల స్ట్రక్చర్ పనుల్ని పూర్తి చేసుకున్న ప్రప్రథమ స్కై స్క్రేపర్ సాస్ క్రౌన్. కోకాపేట్‌లోని గోల్డన్ మైల్ లేఅవుట్‌లో సుమారు నాలుగున్నర ఎకరాల్లో రూపుదిద్దుకుంది ఈ లగ్జరీ ప్రాజెక్టు. సుమారు ఐదు టవర్లలో డిజైన్ చేసిన ప్రాజెక్టులో.. కేవలం 235 కుటుంబాలు నివసించడానికి అవకాశముంది. అంటే, ఆ 235 ఫ్యామిలీస్ వెరీ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. 200 మీటర్ల కంటే ఎత్తులో నివసించాలని కోరుకునేవారి కోసం సుమారు ఇరవై ఐదు డ్యూప్లేలున్న ప్రాజెక్టే.. సాస్ క్రౌన్ అని చెప్పొచ్చు.
వాసవి ఆనంద నిలయం@ఎల్‌బీనగర్ మెట్రో
హైద్రాబాద్ డెవలప్‌మెంట్ మ్యాటర్‌లో రన్నింగ్ రేస్ పెడితే వెస్ట్ సైడ్‌తో సై అంటోంది ఈస్ట్‌సైడ్. అలాంటి తూర్పు హైద్రాబాద్‌కి తమ ఆనంద నిలయం ప్రాజెక్ట్‌తో కొత్త అందాల్ని జోడించడానికి సిద్ధమవుతోంది వాసవీ గ్రూప్. ఎల్‌బీ నగర్ మెట్రో స్టేషన్‌కు చేరువలోనే ఉంది వాసవీ ఆనంద నిలయం. 29.3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 3 వేల 576 ఫ్లాట్స్ నిస్తున్నారు. మొత్తం 72 శాతం ఓపెన్ స్పేస్ ఉండేలా నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్.. దక్షిణ భారతంలోనే అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. లష్ గ్రీనరీతో.. సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య స్వర్గాన్ని తలపించే ఆనంద నిలయంలో దాదాపు 100కి పైగా హై ఎండ్ వరల్డ్ క్లాస్ ఎమెనిటీస్‌ని వాసవీ గ్రూప్ అందుబాటులోకి తేనుంది.
కొండాపూర్‌లో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా
పొప్పాల్ గూడలో టీమ్4ఆర్కా
ల్యాంకో హిల్స్ చేరువలో టీమ్ ఫోర్ లైఫ్ స్పేసెస్ సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టే.. టీమ్ 4 ఆర్కా. అత్యున్నతమైన ఫీచర్లు, అధునాతన సౌకర్యాలు, అదిరిపోయే డిజైన్ తో ఈ సూపర్ లగ్జరీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం 6 టవర్లను 43 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ప్రతి అంతస్తుకు నాలుగైదు యూనిట్లు ఉంటాయి. ప్రతి అంతస్తుకూ ఐదు ఎలివేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 2120 చదరపు అడుగుల నుంచి 4410 చదరపు అడుగుల్లో ఫ్లాట్ సైజుల్ని పెట్టారు. ప్రాజెక్టు మొత్తం ఒక ఎత్తైతే.. క్లబ్ హౌస్ మరో ఎత్తు. దీన్ని ఆరు అంతస్తుల ఎత్తులో డిజైన్ చేశారు. ఆకాశహర్మ్యాల్లో నివసించాలని ఆశించేవారు టీమ్ ఫోర్ ఆర్కాను విజిట్ చేయాల్సిందే.