General

స్టాంప్ డ్యూటీ ఎలా చెల్లించాలి?

స్టాంప్ డ్యూటీ ఎలా చెల్లించాలి?
  • భారతదేశం వెలుపలి డాక్యుమెంటును తెలంగాణలో వినియోగించుకోవాలనుకుంటే దానిపై స్టాంపు డ్యూటీ ఎలా చెల్లించాలి? భారతదేశంలో అలాంటి డాక్యుమెంటు అందిన తేదీ నుంచి మూడు నెలలలోపు స్టాంపు డ్యూటీ చెల్లించవచ్చు. భారత స్టాంపు చట్టం, 1899లోని సెక్షన్‌ 18 ప్రకారం జిల్లా రిజిస్ట్రార్‌కు ఆ పత్రాన్ని సమర్పించి, చెల్లింపు చేయాలి.
  • నేను వారసత్వంగా ఆస్తిని పొందినట్టయితే మ్యుటేషన్‌ డాక్యుమెంట్‌ రిజిస్టర్‌ చేసుకోవాలా?లేదు, అవసరంలేదు.
  • టి-రిజిస్ట్రేషన్‌ యాప్‌ అంటే ఏమిటి? ఇది తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆన్లైన్‌ యాప్‌. ప్రస్తుతం ఈ యాప్‌లో హిందూ వివాహ నమోదు సేవ మాత్రమే అందుబాటులో ఉంది.
  • ఈసీ సర్టిఫికెట్‌ పొందట‌మెలా? ఆన్‌లైన్‌ ఈసీకి ఫీజు ఎంత?
ఆస్తి వివరాలు, తేదీ, వాల్యూమ్‌/సీడీ నంబర్‌తో కూడిన రిజిస్టర్డ్‌ డీడీ నంబర్‌, ఆస్తికి సంబంధించిన ఏదైనా మునుపు అమలు చేసిన దస్తావేజు ఫొటోకాపీలు (సేల్‌ డీడ్‌, పార్టిషన్‌ గిఫ్ట్‌ డీడ్‌ మొదలైనవి), చిరునామా ధ్రువీకరణ కాపీ ఇవ్వాలి. దరఖాస్తుదారు వయసు 30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఈసీ సర్టిఫికెట్‌ కోసం సర్వీసు చార్జీ రూ.25, ఇతర చార్జీలు రూ.500 చెల్లించాలి. దరఖాస్తుదారు వయసు 30 సంవత్సరాల కంటే తక్కువైతే రూ.200 చెల్లించాలి.

Related News

celebrity-homes

No articles available.

No posts available
No posts available