General

మధ్యతరగతి వారి కోసం హెచ్ఎండీఏ లేఅవుట్లు

మధ్యతరగతి వారి కోసం హెచ్ఎండీఏ లేఅవుట్లు
హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే మధ్య తరగతి వారి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందు కోసం స్పెషల్ హౌసింగ్ డెవలప్మెంట్ పాలసీ తో పాటు లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ ను అమల్లోకి తీసుకురానుంది హెచ్ఎండీఏ. ఈ క్రమంలో ఇప్పటివరకు భారీ లేఅవుట్లను అభివృద్ధి చేస్తూ వస్తున్న హెచ్ఎండీఏ.. సామాన్య, మధ్య తరగతి వారి కోసం చిన్న లేఅవుట్ల అభివృద్దిపై దృష్టి సారించింది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ సామాన్య, మధ్య తరగతి వారి సొంతింటి కల పై దృష్టి సారించింది. ఈ మేరకు కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హెచ్ఎండీఏ చేస్తున్న కసర్తతు తుది దశకు చేరుకుంది. హైదరాబాద్ పరిధిలో హౌసింగ్ కు పెద్దపీట వేయాలని డిసైడ్ అయ్యింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో త్వరలోనే సమగ్ర హౌసింగ్ డెవలప్మెంట్ పాలసీ తీసుకువచ్చేందుకు సిద్దమైంది హెచ్ఎండీఏ. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న టౌన్ ప్లానింగ్ లాగే లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది హెచ్ఎండీఏ. ALSO READ: అపార్ట్ మెంట్ లోనా.. ఫ్లాటా లేక విల్లానా? లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ లో భాగంగా ప్రస్తుతం భారీ నిర్మాణాలు, విల్లాలు, టౌన్ షిప్ లకు ఇస్తున్న అనుమతుల మాదిరిగానే చిన్న నివాస ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చిన్న చిన్న లేఅవుట్లు అభివృద్ది చేసి ప్లాట్లను విక్రయించనున్నారు. ఇందుకు త్వరలోనే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కండ్లకోయ, ప్రతాప్ సింగారం, మేడిపల్లి, కోకాపేట, కీసర, బుద్వేల్ తదితర ప్రాంతాల్లో లేఅవుట్ల అభివృద్దికి ప్రాణాళికలు సిద్దం చేస్తోంది హెచ్ఎండీఏ. మరీ ముఖ్యంగా సామాన్యులు, మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేలా ప్లాట్లను అందించేలా లేఅవుట్లను డెలవప్ చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములతో పాటు రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సేకరిస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ భూములు, ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి సేకరించిన భూముల్లో లేఅవుట్లను అభివృద్ధి చేస్తోంది హెచ్ఎండీఏ. ఈ లేఅవుట్లలో తక్కువ విస్తీర్ణంతో ప్లాట్లను సామాన్య, మధ్య తరగతి వారికి విక్రయించనున్నారు. లో కాస్ట్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ లో భాగంగా ప్లాట్లు కొన్న వారికి నేరుగా ఇల్లు కట్టుకునే సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. జులై నెలాఖరుకి కండ్లకోయ, ప్రతాప్ సింగారం, మేడిపల్లి, కోకాపేట, కీసర, బుద్వేల్ తదితర ప్రాంతాల్లో లేఅవుట్లను అభివృద్ధి చేసి విక్రయించాలనే లక్ష్యంతో హెచ్ఎండీఏ ముందుకు వెళ్తోంది. ఇదే సమయంలో కోకాపేట్, బుద్వేల్ లో గతంలో భారీ లేఅవుట్లను అభివృద్ధి చేసిన హెచ్ఎండిఏ.. మరిన్ని ప్రాంతాల్లో పెద్ద లేఅవుట్ల డెవలప్మెంట్ పైనా దృష్టి సారించిందని అధికారులు చెబుతున్నారు.

Related News

celebrity-homes

No articles available.

No posts available
No posts available