General

నాణ్యత, టైమ్ లీ డెలివరీ ఇదే మా నినాదం..

నాణ్యత, టైమ్ లీ డెలివరీ ఇదే మా నినాదం..
  • రియల్ ఎస్టేట్ గురు ఇంటర్వ్యూలో హరిహర ఎస్టేట్స్ అధినేత యాదవరెడ్డి
  • 30 ఏళ్లు.. 40 ప్రాజెక్టులు..
  • 30 ల‌క్ష‌ల చ‌.అ. స్థ‌లం డెవ‌ల‌ప్ చేశాం..
  • లాభం గురించి ఎలాంటి ఎస్టిమేటూ వేసుకోం
  • కట్టుకుంటూ పోతాం.. వచ్చిందే చాలనుకుంటాం
  • మా కస్టమర్లందరూ ఫుల్ హ్యాపీ
  • చిన్న వెంచర్లతో మొదలై నేడు ఈ స్థాయిలో ఉన్నాం

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే దాదాపు అందరి చూపూ వెస్ట్ వైపే ఉంటుంది. కానీ ఆయన మాత్రం ఈస్ట్ హైదరాబాద్ నే ఎంచుకున్నారు. చేపట్టిన ప్రాజెక్టులో ఎక్కువ లాభాల్ని గ‌డించాల‌ని చాలామంది డెవలపర్లు భావిస్తారు. కచ్చితంగా ఇంతకు అమ్ముదాం అని ముందే ఎస్టిమేట్ వేసుకుంటారు. కానీ ఆయన మాత్రం నాణ్యమైన నిర్మాణాలు కట్టుకుంటూ పోదాం.. ఎంత వస్తే అది మన లాభం అనుకుంటారు. ఎలాగోలా కట్టిపారేద్దాం.. ఎప్పటికైతే అప్పటికే పూర్తి చేసి ఇద్దామనే ఆలోచన ఆయన దరిదాపుల్లో కూడా ఉండదు.

నాణ్యత, టైమ్ లీ డెలివరీ.. ఇదే నినాదంతో 30 ఏళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకున్నారు. ఆయనే.. హరిహర ఎస్టేట్స్ అధినేత యాదవరెడ్డి. 1996లో చిన్నచిన్న వెంచర్లతో ప్రారంభమైన ఆయన రియల్ ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అప్రతిహతంగా సాగుతోంది. ప్రతి ప్రాజెక్టునూ సొంతింటిలా భావించి నాణ్యతతో నిర్మిస్తారు. హైదరాబాద్ లో దాదాపు 40 ప్రాజెక్టులు పూర్తి చేసి, కొన్ని వందల కుటుంబాల సొంతింటి కలను నిజం చేశారు. ఈ నేపథ్యంలో యాదవరెడ్డితో రియల్ ఎస్టేట్ గురు ముచ్చటించింది. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ..

మీ ఫ్యామిలీ గురించి చెబుతారా? మాకు ఇద్దరు అమ్మాయిలు.. యూఎస్ సిటిజన్స్.. అబ్బాయి ఇక్కడే, మా బిజినెస్ లన్నీ చూస్తారు. నా భార్య హౌస్ వైఫ్.

1996లో రియల్ రంగంలోకి ఎంటరయ్యారు. అసలు ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు?

నేను హైదరాబాద్ వచ్చి రామంత్ పూర్ లో అద్దెకు ఉండేవాడిని. 1981లో ఓపెన్ ప్లాట్ వెంచర్ల హవా నడుస్తోంది. అవన్నీ చూసి రియల్ ఎస్టేట్ అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాను. 1989లో చిన్న చిన్న వెంచర్లు మొదలుపెట్టాం. నాలుగెకరాలు, ఐదెకరాల్లో వేశాం. అప్పుడు భాగ్యనగర్ డెవలప్ మెంట్ అథార్టీ (బీడీఏ) ఉండేది. కానీ అప్పట్లో పబ్లిక్ లో అంత అవేర్ నెస్ లేదు. ఆ చిన్న చిన్న లేఔట్ల వల్ల కొంత అనుభవం వచ్చింది. లేఔట్లు ఎందుకు? ఇల్లు నిర్మించి ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాం. అప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇస్యూస్ ఉండేవి. ఇప్పుడు మూడు నాలుగు రోజుల్లోనే ఇంటి రుణం వస్తుంది. కానీ అప్పట్లో చాలా కఠినంగా ఉండేది.

ఎల్ఐసీ, ఎస్ బీఐ లో రుణం కోసం అప్లై చేస్తే చాలా గట్టిగా స్క్రూటినీ చేసేశారు. దీంతో చాలామంది ప్లాట్ కొనుక్కుని వారే ఇల్లు కట్టుకునేవారు. అప్పుడు నాకు ఓ ఆలోచన వచ్చింది. 180, 200 గజాల్లో ఇళ్లు కడితే ఎలా ఉంటుందని భావించి ఈ రంగంలో అడుగు పెట్టాను. నాలుగైదేళ్ల పాటు ఏడాదికి 10 నుంచి 12 ఇళ్లు మాత్రమే కట్టేవాళ్లం. కానీ ఆ పది ఇళ్లు అమ్ముడవడానికి కూడా ఏడాది సమయం పట్టేది. 1993లో అపార్ట్ మెంట్ వాతావరణం బాగా నడుస్తోంది. దీంతో మన బడ్జెట్లో అపార్ట్ మెంట్ కడితే బావుంటుందని ఆలోచించి, 350 గజాల్లో జీ ప్లస్ టూ అలా రెండు రెండు ప్లోర్లలో 6 లేదా 7 ఫ్లాట్లతో అపార్ట్ మెంట్లు కట్టడం ప్రారంభించాం.

1996లో మొదటి అపార్ట్ మెంట్ ఎక్కడ కట్టారు? అప్పుడు కన్ స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయ్యేది? వాటిని ఎంతకు అమ్మేవారు? బయ్యర్లు ఎలా ఉండేవారు? అప్పుడు కన్ స్ట్రక్షన్ అంతా సింగిల్ బెడ్ రూమ్, టూ బెడ్ రూమ్ కాన్సెప్టే ఉండేది. త్రిబుల్ బెడ్ రూమ్ అనేది చాలా తక్కువ. సింగిల్ బెడ్ రూమ్ 600, డబుల్ బెడ్ రూమ్ అయితే 900, 1000, 1100 చదరపు అడుగులు ఉండేవి. అప్పట్లో కాస్ట్ చాలా తక్కువ ఉండేది. ఎస్ ఎఫ్ టీ రూ.400, రూ.500 అలా ఉండేది. మేం అప్పట్లో ఎస్ ఎఫ్ టీ రూ.280, రూ.300 అలా అమ్మేవాళ్లం. ఎస్ ఎఫ్ టీకి రూ.50, రూ.100 మార్జిన్ లోనే అమ్మేవాళ్లం. అప్పట్లో కొనేవాళ్లు తక్కువగా ఉండేవారు.

WATCH INTERVIEW

[embed]https://www.youtube.com/watch?v=u6UxRpMSI9k[/embed]

ఫస్ట్ ప్రాజెక్టులో మీ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడున్నట్టుగా అప్పట్లో ప్రీ లాంచ్ వంటి స్కీములు ఉండేవి కావు. మొత్తం నిర్మాణం పూర్తయి, బ్రిక్ వర్క్, కలరింగ్ అంతా అయిన తర్వాత రెడీ టూ ఆక్యుపైలో ఉన్నప్పుడు మాత్రమే ఫ్లాట్లు కొనుక్కునేవాళ్లు. అప్పటి ట్రెండ్ అది. దానికితోడు ఏడాదికి రెండు ప్రాజెక్టులు మించి చేయలేకపోయేవాళ్లం.

1996లో ప్రారంభమైన మీ కంపెనీ ఎక్కడెక్కడ ప్రాజెక్టులు చేసింది? నేను ఎక్కువగా ఈస్ట్ లో.. హబ్సిగూడ్ స్ట్రీట్ నెం.8లో 20 ప్రాజెక్టుల వరకు చేశాను. అప్పట్లో నాకు క్వాలిటీ, టైమ్ లీ డెలివరీ అనే బ్రాండ్ ఉండేది. మేం కన్ స్ట్రక్ట్ చేస్తున్నాం అంటే ఎలాంటి పేపర్ యాడ్ లేకుండా, ఏజెంట్లు లేకుండా మా ప్లాట్లన్నీ అమ్ముడైపోయేవి. మాకు తెలిసిన కస్టమర్లే వచ్చి కొనుక్కునేవారు. వారు మా మీద పెట్టుకున్న నమ్మకమే దీనికి కారణం. 35 ఏళ్ల క్రితం కొనుక్కున్నవారి మనవలు, మనవరాళ్లు కూడా వచ్చి మా దగ్గర కొనుక్కుంటుంటారు. యాదవరెడ్డిగారు కడుతున్నారు.. మనం బ్లైండ్ గా కొనుక్కోవచ్చు అనే బ్రాండ్ ఇమేజ్ తోనే మా డెవలప్ మెంట్ అయింది.

ఎంత బిల్టప్ ఏరియా కట్టారు? టోటల్ గా ఎన్ని ప్లాట్లు నిర్మించారు? బిల్డప్ ఏరియా అంటే లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ లేదు. అయితే, వెయ్యి వరకు ఫ్లాట్లను నిర్మించి ఇచ్చాం. అప్పుడు ఇక్కడ ఓపెన్ ఏరియా లేదు. దాంతో ఎకరం లేదా రెండు ఎకరాల సైట్ తీసుకుని దానిని సబ్ డివిజన్ చేసి విల్లాలు లేదా అపార్ట్ మెంట్లు కట్టే వాళ్లం.

మొదటి పదేళ్లలో ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? లేదు. ఎందుకంటే ల్యాండ్ కొనేటప్పుడే లీగల్ గా చూసుకునేవాళ్లం. అలాగే పర్మిషన్లు చాలా ఈజీగా వచ్చేవి. సేల్స్ పరంగా ఓవర్ నైట్ 200 శాతం పెరగలేదు. ఏడాదికి ల్యాండ్ రేట్ అయినా, అపార్ట్ మెంట్ రేట్ అయినా 10 శాతం మాత్రమే పెరిగేవి. కన్ స్ట్రక్షన్ కాస్ట్ కూడా అంతే. సిమెంట్, స్టీల్ వంటివి ఏడాదికి 5 శాతం నుంచి 10 శాతం మాత్రమే పెరిగేవి. అసాధారణమైన పెరుగుదల ఉండేది కాదు. దాంతో అమ్మకపు ధర కూడా అలాగే ఉండేది. లాస్ట్ ఇయర్ కొన్నవారికి, ఈ ఏడాది కొన్నవారికి ధరలో తేడా 10 శాతం మించి ఉండేది కాదు. నిదానమే ప్రదానం అన్న రీతిలో మార్కెట్ ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా కొనసాగింది.

డిమాండ్ ఎక్కడుందో అక్కడే ప్రాజెక్టులు కట్టేవారు. అసలు ల్యాండ్ ఎలా ఎంపిక చేసుకునేవారు? ఎక్కడ మార్కెట్ ఉండేదో అక్కడే సైట్ సెలక్ట్ చేసుకునేవాడిని. ప్రీమియం ప్లాట్లు కొనేవాడిని. ఎందుకంటే మనం ఎంత ప్రొడక్షన్ చేసినా మార్కెటింగ్ లేకుంటే వేస్ట్. బ్రాండ్ ఇమేజ్ ఇక్కడే డెవలప్ అయింది. ఓ గుడ్ విల్ ఉంది. ఓ సైట్ అయిపోగానే మరో సైట్ వచ్చేది. ఓ సైట్ చేస్తున్నప్పుడు దాని చుట్టూ నాలుగు సైట్లు డెవలప్ చేస్తా. ఎందుకంటే వారే వచ్చి మాది కూడా కట్టండి అని ఇచ్చేవాళ్లు. నాతో ఉన్నవాళ్లు చాలామంది వెస్ట్ కి వెళ్లి బాగా డెవలప్ అయ్యారు. కానీ నేను మాత్రం ఈస్ట్ లోనే ఫోకస్ చేసి ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే మాకు మార్కెటింగ్ చాలా ఈజీ. నేను పర్మిషన్ తెచ్చుకుని, వర్క్ స్టార్ట్ చేస్తే 50 శాతం బుకింగ్స్ అయిపోతాయి.

1996 నుంచి 2006 వరకు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉండేది? స్థలాల రేట్లు ఎలా ఉండేవి? బిల్డర్ల ఏట్టిట్యూడ్ ఎలా ఉండేది? ల్యాండ్స్ రేట్ల పెరుగుదల 10 నుంచి 20 శాతమే ఉండేది. బంజారాహిల్స్, హైటెక్ సిటీలో కూడా ఇళాగే ఉండేది. అప్పుడు కోకాపేట వంటివి లేవు. హైటెక్ సిటీ డెవలప్ అయిన తర్వాత కూడా క్రమంగానే పెరిగాయి. అసాధారణంగా ఏమీ పెరగలేదు. నేను కొండాపూర్ లో కూడా అపార్ట్ మెంట్ కట్టాను. నిర్మాణ వ్యయం, ల్యాండ్ రేట్లు, సేల్ ప్రైస్.. అంతకంటే పెరిగేవి కావు. అప్పుడంతా నార్మల్ గా, ఫ్లాట్ గా డెవలప్ మెంట్ జరిగింది. దాంతో డెవలపర్లు కూడా పెద్దగా ఇబ్బందులు పడినవాళ్లు లేరు.

WATCH INTERVIEW

వెస్ట్ హైదరాబాద్ కంటే ఈస్ట్ హైదరాబాద్ లోనే అపార్ట్ మెంట్లు కట్టడం వెనుక కారణాలేంటి? వెస్ట్ లో సాఫ్ట్ వేర్ తో లింకును బట్టి హై అవుతుంది, లో అవుతుంది. కానీ ఇది రూరల్ మార్కెట్. టీచర్లు, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, హైయ్యర్ క్లాస్ ఎంప్లాయీస్ ఇక్కడ ఉంటారు. అందువల్ల ఒకేసారి పెరగదు. ఒకేసారి తగ్గిపోదు. ఈస్ట్ కానీ, నార్త్ కానీ నార్మల్ గానే గ్రోత్ అవుతుంది. కానీ వెస్ట్ లో సాఫ్ట్ వేర్ బావుండి ఎంప్లాయీస్ ఎక్కువ వస్తే ఒక్కసారిగా రేట్లు పెరిగిపోతాయి. అదే మాంద్యం వస్తే అదే స్థాయిలో తగ్గిపోతుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు.

2006లో 86 జీవో వచ్చిన తర్వాత బిల్డర్ల యాటిట్యూడ్ ఎలా మారిపోయింది? 86 జీవో ముందు బాగా డీవియేషన్ చేసేవారు. పర్మిషన్ తీసుకున్న తర్వాత బాల్కనీలు ఎక్స్ టెండ్ చేసేవారు. నేను కూడా అలాగే చేశాను. పబ్లిక్ కూడా అలాగే కొనేవారు. 86 జీవో వచ్చిన తర్వాత కాస్త కష్టమైంది. ఈ విషయంలో ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే. 10 శాతం మార్టిగేజ్ రూల్ వచ్చిన తర్వాత బిల్డర్లు కూడా డీవియేషన్లు చేయడంలేదు. అలాగే కొనుగోలుదారుల్లో కూడా అవేర్ నెస్ వచ్చింది. అందువల్ల 86 జీవో తర్వాత బిల్డర్ తప్పు చేస్తే కొనుగోలుదారుల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

86 జీవో వల్ల చిన్న బిల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొంటారనే ప్రచారం జరిగింది. ఇది నిజమేనా? ప్రభుత్వం ఓ పాలసీ తీసుకొచ్చిందంటే తొలుత కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. బస్సులో వెళ్లేవాడిని కింద నడవమంటే ఇబ్బంది అనిపిస్తుంది. అదే కొద్ది దూరం నడిచిన తర్వాత ఇది కూడా బానే ఉందనిపిస్తుంది. ఇది కూడా అంతే. జీవో 86 తర్వాత ల్యాండ్ రేట్లు కూడా రెగ్యులరైజ్ అయ్యాయి. గతంలో ఎక్కువ ఫ్లోర్లు కట్టి ఎక్కువ పర్సంటేజ్ ఇస్తాను అని చెప్పి ఎక్కువ రేటుకు ల్యాండ్ కొనేవారు. కానీ జీవో 86 తర్వాత ఎంత వస్తుంది అనేదానిపై ముందే స్పష్టత ఉంటుంది కాబట్టి, దానికి అనుగుణంగానే ల్యాండ్ లార్డ్, డెవలపర్ ఒప్పందానికి వస్తున్నారు. ఇది అందరికా బాగానే ఉంది. దీనివల్ల చిన్న బిల్డర్లకు ఇబ్బంది వస్తుందనడం నిజం కాదు.

1996 నుంచి 2025 వరకు ఎన్ని అపార్ట్ మెంట్లు కట్టారు? ఎన్ని కమర్షియల్ ప్రాజెక్టులు కట్టారు? ఇప్పటివరకు మొత్తం 40 ప్రాజెక్టులు పూర్తి చేశాం. దాదాపు 4వేల మందికి పైగా కస్టమర్లు ఉన్నారు. 30 లక్షల చదరపు అడుగుల వరకు డెలివరీ చేశాం. ప్రస్తుతం 20 లక్షల చదరపు అడుగులు నిర్మాణంలో ఉంది. క్వాలిటీ, టైమ్ లీ డెలివరీ అనేది మా నినాదం. పని చేసుకుంటూ వెళతాం. ఎంత ప్రాఫిట్ వస్తుందో అదే మాది అనుకుంటాం. అంతే తప్ప.. ఇంత ప్రాఫిట్ రావాలి అని ఎస్టిమేట్ వేసుకోం. అందువల్ల మా ప్రతి కస్టమర్ పూర్తి హ్యాపీగా ఉన్నారు. కమర్షియల్ లో 6 ప్రాజెక్టులు చేశాం. ఇవి అమ్మలేదు. అయితే, రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో మాత్రం ఒక్క ఫ్లాట్ కూడా ఉంచుకోం. అన్నీ సేల్ చేసేస్తాం.

ప్రస్తుతం మీ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఏమిటి? పీర్జాదిగూడలో చెన్నారెడ్డి ఎన్ క్లేవ్ జరుగుతోంది. అది మర్రి శశిధర్ రెడ్డిగారి ల్యాండ్. వాళ్లది 20 ఎకరాల ల్యాండ్ ఉంది. అందులో పది ఎకరాల్లో దాదాపు కంప్లీట్ అయింది. ఒకటే రోడ్డులో 4 గేటెడ్ కమ్యూనిటీస్ కడుతున్నాం. 9 ఏళ్లలో 1100 ఫ్లాట్లు నిర్మిస్తున్నం. 800 ప్లాట్లు కస్టమర్లకు హ్యాండోవర్ చేసేశాం. 300 ప్లాట్ల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది.

అలాగే పోచారం చౌరస్తాలో 3 ఎకరాల్లో 15 అంతస్తుల్లో 360 ఫ్లాట్లు కడుతున్నాం. పీర్జాదిగూడలో 2000 చదరపు అడుగుల పైబడి ఫ్లాట్లు ఉంటాయి. పోచారంలో మాత్రం అప్పర్ మిడిల్ క్లాస్ వరకు ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని 1500 నుంచి 1600 చదరపు అడుగుల్లో ఫ్లాట్లు డిజైన్ చేశాం. అలాగే కీసర జంక్షన్ లో విల్లా ప్రాజెక్టు నడుస్తోంది. అక్కడ 69 విల్లాలు వస్తున్నాయి.