విజయవాడ- గుంటూరు నేషనల్ హైవే-16 సమీపంలోని తాడేపల్లిలో ఉంది అపర్ణా అమరావతి వన్. తొమ్మిది ఎకరాల్లో.. 8 బ్లాక్‌లు.. ఒక్కో బ్లాక్‌కి 10 అంతస్థుల చొప్పున ఉండనుంది ఈ ప్రాజెక్ట్. ఆకట్టుకునే ఆర్కిటెక్చర్‌తో పాటు బయ్యర్ల కోసం స్పేషియస్ లివింగ్, హై రైజ్ లగ్జరీ, విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. 612 త్రీ అండ్ ఫోర్ బీహెచ్‌కే యూనిట్లు ఉన్నాయిందులో. త్రీ బీహెచ్‌కే యూనిట్స్ 1562- 1810 చదరపు అడుగుల్లో ఉండగా.. ఫోర్ బీహెచ్‌కే యూనిట్స్ 2010 స్క్వేర్ఫీట్స్లో నిర్మించారు. చిల్డ్రన్ ప్లే ఏరియా, మల్టీపర్పస్ హాల్, ఔట్‌డోర్ క్రికెట్ పిచ్, స్కేటింగ్ రింక్, టెన్నిస్, ఏరోబిక్స్ సహా అనేక అమెనిటీస్ ఉన్నాయ్. లొకేషన్పరంగా విజయవాడ- గుంటూరు మధ్యలో ఉండటంతో విద్యాసంస్థలు, హాస్పిటల్స్ లాంటి వాటికి ఈజీగా చేరుకోకొవచ్చు. ఇక తాడేపల్లికి అమరావతి దగ్గరే కావడంతో రాజధాని ఏరియా కూడా కలిసొస్తుంది ఈ ప్రాజెక్ట్‌కి.
ప్రాజెక్ట్- కావూరి డెవలపర్స్- గ్రాండ్ ప్రాజెక్ట్
లొకేషన్- ఎన్ఆర్ఐ హాస్పిటల్ సమీపంలో, అమరావతి
యూనిట్ టైప్- 2 & 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్
యూనిట్ సైజ్- 1190-2240 చదరపు అడుగులు
కోర్ క్యాపిటల్ ఏరియాలో కావూరి హిల్స్ డెవలపర్స్ చేపట్టిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్- గ్రాండ్ ప్రాజెక్ట్. అమరావతిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ సమీపంలో ఉంది ఈ గ్రాండ్ ప్రాజెక్ట్. 6.9 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్ట్‌లో 4 హై రైజ్ రెసిడెన్షియల్ టవర్స్ డిజైన్ చేశారు. ఒక్కో టవర్‌లో 14 అంతస్థులు కాగా 1190 నుంచి 2240 చదరపు అడుగుల మధ్యలో టూ అండ్ త్రీ బీహెచ్‌కే యూనిట్లు ప్లాన్ చేశారు. క్లబ్‌హౌస్, విజయవాడలో మొదటిసారిగా మినీప్లెక్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్ అలాగే మహిళల కోసం వుమెన్ ఓన్లీ పూల్, మినీ షాపింగ్ కాంప్లెక్స్, రెస్టారెంట్ అండ్ కేఫే సహా వరల్డ్ క్లాస్ అమెనిటీస్ ప్లాన్ చేశారు.
లొకేషన్ విషయానికొస్తే అమరావతిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ గ్రాండ్ ప్రాజెక్ట్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోనే ఉంది. కోర్ క్యాపిటల్ అమరావతి ఉన్న ప్రాంతమిది. ఇక్కడ్నుంచి పది నిమిషాల్లో విజయవాడ బెంజ్ సర్కిల్‌కు, విజయవాడ రైల్వేస్టేషన్, ఎయిర్పోర్ట్ కూడా సమీపంలోనే ఉన్నాయ్. ఇక మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్ 3.5 కిలోమీటర్లు, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ 3.5 కిలోమీటర్లు, కొత్తగా ప్రతిపాదించిన ఎయిర్పోర్ట్ 7.7 కిలోమీటర్ల దూరమే.
ప్రాజెక్ట్- మంజీరా మోనార్క్
లొకేషన్- ఎన్‌హెచ్-16 సర్వీస్ రోడ్, మంగళగిరి
యూనిట్ టైప్- 2, 3 & 4 బీహెచ్‌కే
యూనిట్ సైజ్- 1070-2724 చదరపు అడుగులు
ప్రాజెక్ట్ స్టేటస్- రెడీ టూ మూవ్
రెరా రిజిస్ట్రేషన్ నంబర్- P07120040007
రాజధాని అమరావతికి దగ్గర్లో డిజైన్ చేసిన మరో లగ్జరీ ప్రాజెక్ట్ మంజీరా మోనార్క్. మంగళగిరిలో ఉండటంతో ఇటు విజయవాడకు కూడా దగ్గరే. లావిష్ లైఫ్‌స్టైల్ కోరుకునే వారికి మంజీరా మోనార్క్ ఫస్ట్ ఛాయిస్ అనేలా ప్లాన్ చేశారు. 5 ఎకరాల్లో తీర్చిదిద్దిన ఈ ప్రాజెక్టులో 1070 నుంచి 2724 చదరపు అడుగుల రేంజ్లో టూ, త్రీ అండ్ ఫోర్ బీహెచ్‌కే యూనిట్లు ఉన్నాయ్. మొత్తం 567 ఫ్లాట్స్ ఉన్నాయిందులో. మంగళగిరిలో ఉండటంతో లొకేషన్పరంగా స్ట్రాటజిక్‌గా కలిసొచ్చే విషయం. ఇక్కడ్నుంచి రాజధాని అమరావతికి విజయవాడ, గుంటూరు ఏ ప్రాంతానికైనా ఈజీగా చేరుకోవచ్చు.
నిర్మాణంలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లు ఒకెత్తు అయితే.. గేటెడ్ కమ్యూనిటీలు.. విల్లాల కోసం డెవలప్ అవుతోన్న ప్లాట్లు మరో ఎత్తు. కస్టమర్ల నుంచి ప్లాట్ల గురించి ఎంక్వైరీలు.. కొనుగోలు చేసే వాటిల్లో వీటి సంఖ్యే ఎక్కువగా ఉండటంతో అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్లాట్ల నిర్మాణాలు, వేగంగా జరుగుతున్నాయ్. పదేళ్ల క్రితం రాజధాని అమరావతిని ప్రకటించినప్పట్నుంచి ఈ ప్రాంతంలో ప్లాట్లకు వచ్చిన డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎంతో కొంత స్థలం కొనుగోలు చేయాలని వారు పెరగడంతో రాజధానితో పాటు దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్లాట్లు పెరిగిపోయాయ్. క్యాపిటల్ రీజియన్, రివర్‌ఫ్రంట్ అంటూ గేటెడ్ కమ్యూనిటీ అండ్ విల్లాల కోసం ప్రత్యేకంగా ప్లాట్లను డెవలప్ చేస్తున్నాయి కొన్ని కంపెనీలు.
ప్రాజెక్ట్- వెర్టెక్స్ క్యాపిటల్ విస్టా
లొకేషన్- ఖాజా
ల్యాండ్ సైజ్- 24 ఎకరాలు
ప్లాట్ రేంజ్- 180-731 చదరపు గజాలు
ప్రాజెక్ట్ స్టేటస్- డెవలప్మెంట్ కంప్లీటెడ్
అమరావతికి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంది వెర్టెక్స్ క్యాపిటల్ విస్టా ప్రాజెక్ట్. 24 ఎకరాల్లో ఇప్పటికే డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్‌లో 180 నుంచి 731 చదరపు గజాల్లో ఓపెన్ ప్లాట్లను డిజైన్ చేశారు. మొత్తం గ్రీన్ సరౌండింగ్‌తో వృద్ధి చేసిన క్యాపిటల్ విస్టాలో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, 40 అడుగుల వెడల్పైన బీటీ రోడ్లు, సోలార్ ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్, అవెన్యూ ప్లాంటేషన్‌తో ల్యాండ్‌స్కేప్డ్ పార్క్స్, సిగ్నేచర్లతో రోడ్లు, ఆర్ఓ వాటర్ ఫ్యూరిఫైయర్స్, అన్ని ప్లాట్లకు ఓనర్ పేరు ప్లాట్ నంబర్లతో సైనింగ్ బోర్డ్స్ లాంటి సదుపాయాలున్నాయ్. క్యాపిటల్ రీజియన్‌లో ఉండటంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్‌కు సమీపంలో ఉన్న వెంచర్ ఇదొక్కటే.
ప్రాజెక్ట్- వెర్టెక్స్ క్యాపిటల్ విస్టా వెస్ట్
లొకేషన్- కంతేరు, అమరావతి
ల్యాండ్ సైజ్- 23 ఎకరాలు
వెర్టెక్స్ డెవలప్ చేసిన మరో ప్రాజెక్ట్ క్యాపిటల్ విస్టా వెస్ట్. అమరావతిలోని కంతేరులో 23 ఎకరాల్లో డెవలప్ చేశారీ ప్రాజెక్ట్‌ని. క్యాపిటల్ విస్టా వెస్ట్ నుంచి అమరావతికి దూరం జస్ట్ వన్ కిలోమీటరే. దీన్ని కూడా మొత్తం గ్రీన్ సరౌండింగ్‌తో వృద్ధి చేశారు. క్యాపిటల్ విస్టాలో మాదిరే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, 40 అడుగుల వెడల్పైన బీటీ రోడ్లు, సోలార్ ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్, అవెన్యూ ప్లాంటేషన్‌తో ల్యాండ్‌స్కేప్డ్ పార్క్స్, సిగ్నేచర్లతో రోడ్లు, ఆర్ఓ వాటర్ ఫ్యూరిఫైయర్స్, అన్ని ప్లాట్లకు ఓనర్ పేరు ప్లాట్ నంబర్లతో సైనింగ్ బోర్డ్స్ లాంటి సదుపాయాలున్నాయ్. ఇప్పటికే ఈ ఏరియాలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్‌లు వేగంగా వృద్ధి చెందుతుండటంతో ప్లాట్లు కొనే వారి సంఖ్యా పెరిగింది.
ప్రాజెక్ట్- శ్రీ సవిత్రు టౌన్షిప్
లొకేషన్- చావపాడు, అమరావతి
ప్లాట్ రేంజ్- 150-400 చదరపు గజాలు
PUDA నంబర్- P.NO.19/2024/1195/DTCP/DPMS
అమరావతిలో శ్రీ సవిత్రు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లను నిర్మిస్తోంది. వినియోగదారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం తమ లక్ష్యమంటోన్న ఈ సంస్థ అమరావతిలోని చావపాడులో శ్రీ సవిత్రు టౌన్షిప్ పేరుతో ఓపెన్ ప్లాట్లను డెవలప్ చేస్తోంది. 150 నుంచి 400 చదరపు గజాల రేంజ్లో ఉన్న ఈ ప్లాట్లు ఏపీ సీఆర్డీఏ అనుమతులు పొందినవే. ఈ టౌన్షిప్లో రెసిడెన్షియల్, కమర్షియల్, గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయ్. చావపాడు- వడ్డమానులో ఇప్పటికే అభివృద్ధి పట్టాలెక్కింది. తూళ్లురు, వెలగపూడి, మంగళగిరి, తాడేపల్లి లాంటి కోర్ క్యాపిటల్‌లో ఉన్న ప్రాంతాలన్నీ సవిత్రు టౌన్‌షిప్‌కు దగ్గర్లోనే ఉన్నాయ్.