- పట్టించుకోని టీజీ రెరా అథారిటీ
- ఈ సంస్థ ఆగడాలకు అడ్డుకట్ట వేయలేరా?
- ఆందోళనలో కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు
గంగోత్రి డెవలపర్స్ అనే నిర్మాణ సంస్థ మూడేళ్ల నుంచి కొల్లూరులో ప్రీలాంచ్‌లో అమ్మకాల్ని చేస్తోన్న విషయం తెలిసిందే. దీనికి ఇంతవరకూ టీజీ రెరా నుంచి అనుమతి రాలేదు. ప్రాజెక్టు ఆరంభం కాలేదు. వందల మంది కస్టమర్ల నుంచి సింగిల్ పేమెంట్ కింద కోట్లాది రూపాయల్ని వసూలు చేసింది. ఈ క్రమంలో, తాజాగా రెండో ఫేజులో కూడా ప్రీలాంచ్ సేల్స్ ఆరంభించిందని సమాచారం.
ఇందుకు సంబంధించి పలువురు ఏజెంట్లు, ఛానల్ పార్ట్‌నర్లతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మూడేళ్ల నుంచి మొదటి ఫేజులో నిర్మాణ పనులు ఆరంభం కాకపోగా, మళ్లీ ఈ కొత్త అమ్మకాలతో ఇంకొంత మంది సామాన్య, మధ్యతరగతి ప్రజల నెత్తి మీద శఠగోపం పెట్టేందుకు సిద్ధమవుతుందని తెలిసింది. ఇలాంటి సంస్థల మాయలో పడి మీ కష్టార్జితాన్ని బూడిదపాలు చేసుకోకండి.