General

అపార్ట్ మెంట్ల నుంచి రెసిడెన్షియల్ ప్లాట్ల వైపు..

అపార్ట్ మెంట్ల నుంచి రెసిడెన్షియల్ ప్లాట్ల వైపు..
  • ప్లాటెడ్ డెవలప్ మెంట్ వైపే జనం మొగ్గు
  • టాప్ లో హైదరాబాద్, ఇండోర్, బెంగళూరు
రియల్ కొనుగోలుదారుల పంథా మారుతోంది. ఒకప్పుడు అపార్ట్ మెంట్ అయినా చాలు అని సరిపెట్టుకునేవారు.. ప్రస్తుతం తమ ధోరణి మార్చుకుంటున్నారు. అపార్ట్ మెంట్ల కంటే రెసిడెన్షియల్ ప్లాట్లు బెస్ట్ అని అటువైపు మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. 2022 నుంచి ఇప్పటివరకు రెసిడెన్షియల్ ప్లాట్ల లాంచ్ లలో హైదరాబాద్, ఇండోర్, బెంగళూరు ముందంజలో ఉన్నాయి. ఇక్కడ కొనుగోలుదారులు ప్లాటెడ్ డెవలప్ మెంట్ల వైపే వెళ్తున్నారు. 2022 నుంచి మే 2025 మధ్య అత్యధిక సంఖ్యలో రెసిడెన్షియల్ ప్లాట్ లాంచ్‌లతో హైదరాబాద్, ఇండోర్ మరియు బెంగళూరు మొదటి మూడు నగరాలుగా అవతరించాయని రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ నివేదిక వెల్లడించింది. 2024లో మాత్రం ఇండోర్, చెన్నై, హైదరాబాద్ టాప్ 3 జాబితాలో ఉన్నాయి. అపార్ట్ మెంట్ల కంటే ప్లాటెడ్ డెవలప్ మెంట్ వైపు జనం ఆసక్తి కనబరచడంతో డెవలపర్లు సైతం అదే బాటలో పయనించారని నివేదిక పేర్కొంది. 2022 నుంచి మే 2025 మధ్య దేశంలోని పది ప్రధాన నగరాల్లో 4.7 లక్షల రెసిడెన్షియల్ ప్లాట్లు లాంచ్ అయినట్టు ప్రాప్ఈక్విటీ పేర్కొంది. ఈ విషయంలో టైర్-1 నగరాల కంటే టైర్ II నగరాలు సరఫరాలో 52% (2.43 లక్షల ప్లాట్లు) వాటాను కలిగి ఉన్నాయి. “కోవిడ్ తర్వాత రెసిడెన్షియల్ ప్లాట్లు కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు సురక్షితమైన స్వర్గధామంగా మారాయి. లిక్విడిటీ, వేగవంతమైన ధర పెరుగుదల, కావాల్సిన విధంగా ఇల్లు కట్టుకునే వెసులుబాటును ఇవి కలిగి ఉండటంతో డిమాండ్ పెరిగింది’ అని ప్రాప్ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్ జసుజా అన్నారు. ప్లాట్ల వైపే ఎందుకు మొగ్గు? సాధారణంగా అపార్ట్‌మెంట్లు అధికంగా ఉండే రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ప్లాట్లు ఇప్పుడు ముందంజలో ఉన్నాయి. దీనికి కొన్ని కారణాలున్నాయి. భూముల విలువలు వేగంగా పెరగడంతోపాటు పెట్టుబడిపై అధిక రాబడి రావడం ఓ కారణం కాగా, హైరైజ్ ప్రాజెక్టులతో పోలిస్తే డెవలపర్ తక్కువ పెట్టుబడి పెడితే సరిపోవడం మరో అంశం. అలాగే అమ్మకాలు సైతం వేగంగా జరిగే అవకాశం ఉండటంతో నగదు ప్రవాహం కూడా వేగంగా సాగుతుంది. పైగా తమకు నచ్చినట్టుగా ఇల్లు నిర్మించుకోవాలనుకువారికి ప్లాట్ అనేది చక్కని ఛాయిస్. ఇక ఈ విషయంలో ప్రాప్ టైగర్ నివేదిక పరిశీలిస్తే.. మొత్తం ప్లాట్ల లాంచ్ లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మాత్రమే టైర్ I నగరాలుగా ఉన్నాయి. ఇవి మొత్తం సరఫరాలో 48% (2.25 లక్షల ప్లాట్లు) వాటా కలిగి ఉన్నాయి. వీటి తర్వాత ఇండోర్, నాగ్‌పూర్, జైపూర్, కోయంబత్తూర్, మైసూర్, రాయ్‌పూర్, సూరత్ లు ప్లాటెడ్ డెవలప్ మెంట్ లో ముందున్నాయి. బలమైన డిమాండ్ ఉన్నప్పటికీ, టాప్ 10 నగరాల్లో నివాస ప్లాట్ల సరఫరా 2024లో 23% YYY తగ్గి 1,26,556 ప్లాట్లకు చేరుకుంది, 2023లో 24% శాతం పెరగ్గా.. 2024లో తగ్గడం గమనార్హం. అయితే, కొత్త లాంచ్‌ల ధర 2024లో 27% పెరిగి చదరపు అడుగుకు రూ.3,679 లేదా చదరపు గజానికి రూ.33,111కి చేరుకుంది.

Related News

celebrity-homes

No articles available.

No posts available
No posts available