General

ఇంటి రుణ భారం తగ్గింపునకు ఈఎంఐ వ్యూహం

ఇంటి రుణ భారం తగ్గింపునకు ఈఎంఐ వ్యూహం
ఇంటి రుణం తీసుకోవడం అంటే జీవితంలో అదిపెద్ద భారాన్ని భుజానికి ఎత్తుకోవడమే. మనం తీసుకున్న రుణానికి దాదాపు రెట్టింపు మొత్తాన్ని 15 నుంచి 30 ఏళ్ల పాటు చెల్లించాల్సి వచ్చే రుణం ఇది. సొంతింటి కలను నెరవేర్చుకోవడం కోసం భారమైనా ఈ రుణాన్ని భరించక తప్పదు. అయితే, ఇంటి రుణాన్ని తీసుకున్ వ్యవధి కంటే ముందుగా చెల్లించడానికి కొన్ని పద్ధతులున్నా.. ఆర్థిక స్వాతంత్ర్యం అందుకు అనుమతించక చాలామంది ఆ పని చేయలేరు. ఈ నేపథ్యంలో ఇంటి రుణంపై వడ్డీని తగ్గించడానికి ఓ మంచి ఈఎంఐ వ్యూహం గురించి నిపుణులు ప్రస్తావిస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ద్వారా వడ్డీ చెల్లింపులను సులభతరం చేసుకునే సూచనలు చెబుతున్నారు. అవేంటో చూద్దామా? ALSO READ: హైడ్రా.. మీకు ఇది న్యాయ‌మేనా? 9% వడ్డీకి 20 సంవత్సరాల కాల వ్యవధితో రూ.20 లక్షల గృహ రుణాన్ని తీసుకుంటే నెలకు ఈఎంఐ రూ.17,861 వరకు ఉంటుంది. రుణ వ్యవధిలో రుణగ్రహీత దాదాపు రూ.43 లక్షలు చెల్లిస్తారు - అందులో రూ.23 లక్షలు వడ్డీయే ఉంది. దీనిని ఎదుర్కొనేందుకు సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్) ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా మీ నెలవారీఆదాయంలో కొంత భాగాన్ని (సాధారణంగా అది మీరు చెల్లించే ఈఎంఐలో 19 నుంచి 27 శాతం ఉండాలి) సిప్ ద్వారా ఈక్విటీ లేదా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి. మార్కెట్ పనితీరును బట్టి, ఈ పెట్టుబడి నుంచి వచ్చే రాబడి రుణంపై చెల్లించే మొత్తం వడ్డీని కవర్ చేస్తుంది లేదా అంతకుమించే చేస్తుంది. ఉదాహరణకు రూ.17,861 ఈఎంఐలో 19 శాతం.. అంటే రూ.3400 సిప్ లో పెట్టుబడి పెట్టాలి. ఇది మీ రుణ కాలవ్యవధిలో రూ.8.16 లక్షలు అవుతుంది. 12 శాతం వార్షిక వడ్డీ చొప్పున ఇది 20 ఏళ్లలో రూ.31.27 లక్షలు అవుతుంది. అంటే నికర రాబడి రూ.23.11 లక్షలు అవుతుంది. ఇది మీరు చెల్లించిన వడ్డీకి సమానం. అయితే, సిప్ ఎంపికలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఫ్లెక్సీ క్యాప్ లేదా లార్జ్-క్యాప్ ఈక్విటీ ఫండ్‌లు దూకుడుగా ఉండే పెట్టుబడిదారులకు సరిపోతాయి. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లు రిస్క్ విముఖత ఉన్నవారికి అనుకూలంగా ఉంటాయి.

Related News

celebrity-homes

No articles available.

No posts available
No posts available