General

7 రోజులు.. 416 ఫ్లాట్లు.. రూ.2300 కోట్లు

7 రోజులు.. 416 ఫ్లాట్లు.. రూ.2300 కోట్లు
ముంబైలో డీఎల్ఎఫ్ తొలి ప్రాజెక్టు లోని ఫ్లాట్టన్నీ విక్రయం ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ ముంబైలోనూ అదరగొట్టింది. దేశ ఆర్థిక రాజధానిలో ట్రైడెంట్ రియల్టీతో కలిసి చేపట్టిన తొలి ప్రాజెక్టులోని ఫ్లాట్లన్నీ వారంలోనే అమ్మేసింది. అంధేరి వెస్ట్ లో ది వెస్ట్ పార్క్ పేరుతో ఈనెల 17న ప్రాజెక్టు లాంచ్ చేసింది. ట్రైడెంట్ రియల్టీతో కలిసి చేపట్టిన ఈ ప్రాజెక్టులో దాదాపు రూ.900 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. డీఎల్ఎఫ్ తన ప్రాజెక్టును ఇలా లాంచ్ చేసిందో లేదో.. అందులోని ఫ్లాట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. వారం రోజుల వ్యవధిలోనే మొత్తం 416 లగ్జరీ అపార్ట్ మెంట్లు విక్రయించడం ద్వారా రూ.2300 కోట్ల ఆదాయం ఆర్జించింది. 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులో మొదటి దశలో 37 అంతస్తులతో కూడిన నాలుగు టవర్లలో 416 యూనిట్లు నిర్మించనున్నారు. 3 బీహెచ్ కే, 4 బీహెచ్ కే యూనిట్లు 1125 చదరపు అడుగుల నుంచి 2500 చదరపు అడుగులు మధ్యలో ఉంటాయి. అలాగే పరిమిత సంఖ్యలో పెంట్ హౌస్ లు కూడా నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులో చదరపు అడుగు ధర రూ,37,500 నుంచి రూ.54,000 మధ్యలో ఉండొచ్చని అంచనా. 845 ప్రత్యేక కార్ పార్కింగ్ స్థలాలు, ప్రత్యేక సందర్శకుల పార్కింగ్ సౌకర్యాలు కూడా ఉంటాయి. అలాగే వెల్‌నెస్ హబ్, యోగా స్టూడియోలు, యోగా డెక్‌లు, కో-వర్కింగ్ స్పేస్‌లు, లాంజ్‌లు, అనేక ఇతర జీవనశైలి సౌకర్యాలతో కూడిన 50,000 చదరపు అడుగుల క్లబ్‌హౌస్ ఉంటుంది. ముంబైలో తమ తొలి అడుగు విజయవంతమైందని.. ముంబై వాసుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాజెక్టును అభివృద్ధి చేసి అందించడానికి గర్విస్తున్నామని డీఎల్ఎఫ్ హోమ్ డెవలపర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి పేర్కొన్నారు.

Related News

celebrity-homes

No articles available.

No posts available
No posts available