General
ఏఐ టెక్నాలజీతో బిల్డ్ నౌ- వేగంగా నిర్మాణ అనుమతులు

నిర్మాణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం బిల్డ్ నౌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. టీజీ బిపాస్ స్థానంలో సరికొత్తగా బిల్డ్ నౌ ను అభివృద్ది చేసింది రేవంత్ సర్కార్. సామాన్యులు సైతం సులభంగా ఇంటి నిర్మాణ, లే ఔట్ అనుమతులు పొందేలా ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన బిల్డ్ నౌ ను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్- జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈజీగా పర్మీషన్స్ తీసుకోవచ్చు. బిల్డ్ నౌ తో భవన నిర్మాణ అనుమతుల కోసం చాలా కాలం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఇంటి స్థలం ఎంత విస్తీర్ణంలో ఉంది, అందులో ఎన్ని అంతస్తులు నిర్మించవచ్చో, వదలాల్సిన సెట్ బ్యాక్‌లు తదితర భవన నిర్మాణ నిబంధనలకు సంబందించిన సమగ్ర సమాచారాన్ని బిల్డ్ నౌ తెలుపుతుంది. సామాన్యులు ఇంటి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తోంది.
ఇంటి నిర్మాణానికి సంబందించిన డ్రాయింగ్స్ పరిశీలన సైతం బిల్డ్ నౌ నిమిషాల్లోనే పూర్తిచేస్తోంది. గతంలో ఉన్న టీజీ బీపాస్ లో ఇన్ స్టంట్ అప్రూవల్ కు, మిగతా అనుమతులకు వేర్వేరు విండోస్ ఉండగా, ప్రస్తుతం బిల్డ్ నౌలో అన్నింటికీ ఒకే విండోతో త్వరితగతిన అనుమతులు జారీ అవుతున్నాయి. ఇక బిల్డ్ నౌ లో ఇంటి నిర్మాణానికి సంబందించిన డ్రాయింగ్, ప్లాన్, స్కెచ్ లు అప్ లోడ్ చేశాక.. భవన నిర్మాణం పూర్తయ్యాక ఇల్లు ఎలా ఉంటుందో కూడా త్రీడీలో చూపుతుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో ప్రారంభించిన ఈ ప్రత్యేక వ్యవస్థను క్రమంగా హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, తెలంగాణ రాష్ట్రం మొత్తం అమల్లోకి తెచ్చేందుకు మునిసిపల్ శాఖ కసరత్తు చేస్తోంది.
బిల్డ్ నౌ ఇలా పనిచేస్తుంది..
1-బిల్డ్ నౌ అత్యాధునిక ఏఐతో పాటు సురక్షిత డిజిటల్ ట్రాన్సాక్షన్ వ్యవస్థ
2-ఇంటి స్థలం పరిమాణానికి సంబంధించిన అవగాహన, ఆటోమేషన్ వంటి వాటితో అత్యంత వేగంగా అనుమతుల జారీ చేస్తుంది.
3-బిల్డ్ నౌ దేశంలోనే అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ వ్యవస్థ కలిగి ఉండటంతో పాటు మెరుపువేగంతో పనిచేస్తుంది.
4-నిన్నటి వరకు నిర్మాణాన్ని బట్టి డ్రాయింగ్ పరిశీలనకు 2 నుంచి 30 రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు కేవలం 5 నిమిషాల్లోపునే ఇంటి నిర్మాణానికి సంబందించిన డ్రాయింగ్ పరిశీలన పూర్తవుతుంది.
5-అధునాతన క్యాడ్ ప్లగిన్ తో బిల్డ్ నౌ పనిచేస్తుంది. దీనికి తోడు డిజైన్ సాఫ్ట్‌వేర్ తో ప్రత్యక్ష అనుసంధానం కలిగి ఉంటుంది.
6-ఇంటికి సంబందించిన డ్రాయింగ్స్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ తక్షణమే నిర్ధారిస్తుంది.
7-బిల్డ్ నౌ ఇంటి నిర్మాణానికి సంబందించిన సాధారణ లోపాలు నివారిస్తూ దరఖాస్తు ప్రక్రియ సులభతరం చేస్తుంది.
8-ప్రాసెస్ ఫ్లోను దరఖాస్తుదారులు ఆన్ లైన్ లో చూసుకోవచ్చు. అంతే కాదు వాట్సాప్ ద్వారానూ అప్ డేట్స్ తెలియజేస్తుంది.
9-అనుమతుల ప్రక్రియలో భాగంగా సందర్భానుసారం మారే ఫీజులు, టారిఫ్ లు, ప్రాసెసింగ్ ఫీజులు తక్షణమే తెలుసుకోవచ్చు.
10-బిల్డ్ నౌ 360 డిగ్రీస్ పారదర్శకతతో పనిచేస్తుంది.
11-స్థూల, సూక్ష్మ స్థాయిల్లో నిర్మాణ ప్రాజెక్ట్ పరిస్థితి, పనితీరు పరిశీలనకు సహకరిస్తుంది.
12-వివిధ ప్రభుత్వ రంగ విభాగాలతో బిల్డ్ నౌ నేరుగా సమన్వయం చేసుకుంటుంది.
13-బిల్డ్ నౌ తో నగర, పట్టణ నియమ నిబంధనలు మార్పుల్పి క్షణాల్లో అప్‌డేట్ చేసుకోవచ్చు.
14-పాలసీ ఆధారిత అప్‌డేట్స్ ను రిపోర్టులు, చట్టపరమైన పత్రాల్లో అమలు చేయొచ్చు.
15-అందరికీ అర్థమయ్యేలా ఇంగ్లిష్ తో పాటు తెలుగు, ఉర్దూ భాషల్లోనూ ఉంటుంది.
16-బిల్డ్ నౌ తో ఎన్ని అంతస్తులకైనా నిర్మాణ అనుమతులు తీసుకోవచ్చు.
17-సింగిల్ విండోతో పలు ప్రభుత్వ విభాగాల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు, ఏఐ టెక్నాలజీతో బిల్డ్ నౌ స్వయంగా సమన్వయం చేసుకుంటుంది.
18-జియో ఇంటెలిజెన్స్ తో ఆటోమేటిక్ గానే మాస్టర్ ప్లాన్‌లు, సంబంధిత నియమ నిబంధనలను పరిశీలిస్తుంది.
19-అడ్వాన్స్‌డ్ క్యాడ్ ప్లగిన్ భారీ భవనాలకు సైతం ఆర్కిటెక్టులు, ఇంజినీర్ల సమయాన్ని తగ్గస్తుంది.
20-అనుమతుల సరళిని వారాలు, నెలల నుంచి రెండు మూడు రోజులకు తగ్గుతుంది.
21-క్యాడ్ ప్లగిన్ వినియోగానికి సంబంధించి వెబ్‌సైట్ నుంచి వన్ టూ వన్ వీడియో కన్సల్టేషన్ కూడా జరపొచ్చు.
Related News
celebrity-homes
No articles available.
No posts available
No posts available