General

బాచుప‌ల్లిలో వేలం.. 2 నెల‌ల క్రితం అమ్మిన రేటూ రాలేదు!

బాచుప‌ల్లిలో వేలం.. 2 నెల‌ల క్రితం అమ్మిన రేటూ రాలేదు!

హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో శుక్ర‌వారం బాచుపల్లి లేఅవుట్‌లోని యాభై ప్లాట్లకు నిర్వహించిన ఈ-వేలానికి గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల నుంచి ఆశించినంత‌గా స్పంద‌న ల‌భించ‌లేదు. ప్లాట్లు అమ్ముడ‌య్యాయి కానీ.. రెండు నెల‌ల క్రితం అమ్మిన ధ‌ర కూడా ప్ర‌స్తుతం రాలేదు. 

తాజా వేలంలో.. బాచుప‌ల్లిలో గ‌జం ధ‌ర సుమారు రూ.49,737గా న‌మోదైంది. రెండు నెల‌ల క్రితం ఇక్క‌డే నిర్వ‌హించిన వేలంలో స‌గ‌టు ధ‌ర రూ.51,991కు అమ్ముడైంది. అప్ప‌ట్లో అధిక ధ‌ర రూ.67,500 న‌మోదు కాగా..

తాజాగా రూ.60,500 రేటు ప‌లికింది. హైద‌రాబాద్‌లో రియ‌ల్ మార్కెట్ దారుణంగా దెబ్బ‌తిన్నద‌ని చెప్ప‌డానికి వేలంలో ప‌లికిన ప్లాట్ల ధ‌ర‌లే నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పొచ్చు.

ఇదీ చదవండి: ఎస్వీఎం ఆదిత్య హోమ్స్‌కు షాక్