General

రూ.6.15 కోట్లకు అపార్ట్ మెంట్ విక్రయం

రూ.6.15 కోట్లకు అపార్ట్ మెంట్ విక్రయం
పుణెలో లగ్జరీ ఫ్లాట్ అమ్మిన ఆశా భోంస్లే కుమారుడు ప్రముఖ గాయని ఆశా భోంస్లే కుమారుడు ఆనంద్ భోంస్లే పుణెలో తమ లగ్జరీ అపార్ట్ మెంట్ ను రూ.6.15 కోట్లకు విక్రయించారు. 3,401 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ ను ఆశా భోంస్లే 2013లో రూ.4.33 కోట్లకు కొన్నారు. ప్రస్తుతం దానిని రూ.6.15 కోట్లకు విక్రయించడం ద్వారా 42 శాతం రాబడి ఆర్జించారు. ఈ వివరాలను సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంస్థ వెల్లడించింది. ఈ అపార్ట్ మెంట్ పుణె మాగర్‌పట్ట సిటీ సమీపంలోని పంచ్‌శిల్ వన్ నార్త్ అనే భవనంలో ఉందని పేర్కొంది. ఈ అపార్ట్ మెంట్ కు 182 చదరపు అడుగు టెర్రస్ తోపాటు ఐదు పార్కింగ్ స్థలాలతో కూడా ఉన్నాయి. 19వ అంతస్తులో ఉన్న ఆ లగ్జరీ ఫ్లాట్ ను పుణెకు చెందిన ప్రేరణ గైక్వాడ్, సంగ్రామ్ గైక్వాడ్ అనే వ్యక్తులకు విక్రయించారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ జూలై 14న జరగ్గా.. రూ.43 లక్షల స్టాంపు డ్యూటీతోపాటు రూ.30వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. పంచ్‌శిల్ రియాలిటీ నిర్మించిన ఈ భవనం పూణే విమానాశ్రయం నుంచి దాదాపు 9 కి.మీ, ఖరడి నుండి 6 కి.మీ, అనేక ఐటీ సంస్థలకు నిలయమైన హింజెవాడి నుండి 25 కి.మీ దూరంలో ఉంది. కాగా, పుణె రియల్ ఎస్టేట్ మార్కెట్ 2024 జూలై నుంచి 2025 జూన్ మధ్యకాలంలో 88,000 యూనిట్లకు పైగా ప్రారంభించగా.. 2023-24 ఇదే కాలంలో ఆ సంఖ్య 99వేలకు పైబడి ఉంది.

Related News

celebrity-homes

No articles available.

No posts available
No posts available