General
నాలుగు ఫ్లాట్లను అద్దెకు తీసుకున్న అమీర్ ఖాన్

బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ ముంబై పాలి హిల్ లో నాలుగు లగ్జరీ అపార్ట్ మెంట్లను అద్దెకు తీసుకున్నారు. తన హౌసింగ్ సొసైటీ రీ డెవలప్ మెంట్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో అమీర్ ఈ ఫ్లాట్లను అద్దెకు తీసుకున్నారు. పాలి హిల్ లోని నర్గిస్ దత్ రోడ్డులో విల్నోమోనా అపార్ట్ మెంట్ అనే సొసైటీలో ఇవి ఉన్నాయి.
అమీర్ ఖాన్ ఉండే 12 అపార్ట్ మెంట్లు కలిగిన విర్గో కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ రీ డెవలప్ మెంట్ కు సిద్ధంగా ఉంది. వాధ్వా గ్రూప్, ఎంఐసీఎల్, చందక్ గ్రూప్ ల జాయింట్ వెంచర్ అయిన అట్మాస్ఫియర్ రియాలిటీ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. దీనిని అల్ట్రా లగ్జరీ సీ వ్యూ అపార్ట్ మెంట్ భవనంగా మారుస్తున్నారు. దీని ధరలు చదరపు అడుగుకు రూ.లక్ష పైనే ఉండొచ్చని అంచనా. కొన్ని యూనిట్ల ధరలు రూ.100 కోట్లకు పైగా ఉంటాయని సమాచారం.
కాగా, అమీర్ ఖాన్ ఈ నాలుగు అపార్ట్ మెంట్లను 2025 మే నుంచి 2030 మే వరకు ఐదేళ్ల కాలానికి నెలకు రూ.24.5 లక్షలు చెలించే ఒప్పందంతో లీజుకు తీసుకున్నారు. 60 నెలల కాలపరమితిలో 45 నెలల లాక్ ఇన్ నిబంధన ఉంది. నాలుగు అపార్ట్ మెంట్లకు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1.46 కోట్లు చెల్లించారు. అలాగే నెలవారీ అద్దె ఏటా 5 శాతం పెరుగుతుంది. ఈ రెండు లావాదేవీలు మే 20న నమోదు కాగా, దీనికి రూ.4 లక్షలకు పైగా స్టాంపు డ్యూటీ, రూ.2వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు.
అమీర్ ఖాన్ నాలుగు అపార్ట్ మెంట్లను అద్దెకు తీసుకున్న కొత్త సొసైటీ విల్నోమోనా.. షారుఖ్ ఖాన్ కుటుంబం తాత్కాలిక నివాసం పూజా కాసా నుంచి దాదాపు 750 మీటర్ల దూరంలో ఉంది. షారుక్ నివాసం మన్నత్ మరమ్మతుల నేపథ్యంలో ఆయన ఇల్లు మారిన సంగతి తెలిసిందే.
Related News
celebrity-homes
No articles available.
No posts available
No posts available