General

రెండున్న‌రేళ్ల త‌ర్వాతే హైద‌రాబాద్‌లోకి ఇన్వెస్ట‌ర్లు?

రెండున్న‌రేళ్ల త‌ర్వాతే హైద‌రాబాద్‌లోకి ఇన్వెస్ట‌ర్లు?

తెలుగు రాష్ట్రాల ఐటీ రాజధాని అయిన హైదరాబాద్, మహారాష్ట్రలోని పుణె నగరాల్లో ధరల పెరుగుదల వేగం కొంత నెమ్మదించింది. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు కేవ‌లం 3.3 శాత‌మే పెరిగాయి. అయితే, కొన్ని చోట్ల అయితే మ‌రీ దారుణంగా ప‌డిపోయాయి. ఒక్క వెస్ట్ హైద‌రాబాద్ మిన‌హాయిస్తే.. మిగ‌తా ప్రాంతాల్లో ఇళ్ల అమ్మ‌కాలు పెద్దగా జ‌ర‌గ‌డం లేదు. రాజ‌కీయ అనిశ్చితి నెల‌కొన్న కార‌ణంగా.. ఇన్వెస్ట‌ర్లు హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ముందుకు రావ‌డం లేదు. మ‌రో రెండున్న‌రేళ్ల‌లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల వ‌ర‌కూ వేచి చూస్తే బెట‌ర్ అని అధిక శాతం ఇన్వెస్ట‌ర్లు భావిస్తున్నారు. ఎందుకంటే, ఇప్పుడు పెట్టుబ‌డి పెట్టినా పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌ద‌ని.. అప్రిసియేష‌న్ కూడా ఎక్కువ రాద‌నే ఉద్దేశ్యంతో.. అధిక శాతం ఇన్వెస్ట‌ర్లు.. హైద‌రాబాద్ వైపు చూడ‌ట్లేదు. ఏడాదిన్న‌ర దాటితే ఎలాగూ ఎన్నిక‌ల సీజ‌న్ వ‌చ్చేస్తుంది.. ఆ త‌ర్వాత మ‌రో ఏడాది రాజ‌కీయ పార్టీల మ‌ధ్య హోరాహోరీ పోరాటం ఉంటుంది. ఆత‌ర్వాత ఎవ‌రు గెలుస్తారో చూసి.. హైద‌రాబాద్ రియాల్టీలో ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టేందుకు ఇన్వెస్ట‌ర్లు ముందుకొచ్చే అవ‌కాశ‌ముంది.