General

హైద‌రాబాద్‌లో ఇళ్ల కొనుగోళ్ల పండ‌గ‌ను తెచ్చిన న‌రెడ్కో తెలంగాణ 

హైద‌రాబాద్‌లో ఇళ్ల కొనుగోళ్ల పండ‌గ‌ను తెచ్చిన న‌రెడ్కో తెలంగాణ 

* అక్టోబ‌రు 10 నుంచి 12 దాకా
* న‌రెడ్కో తెలంగాణ 15వ ఎడిష‌న్ ప్రాప‌ర్టీ షో.. 
* వేదిక‌: హైటెక్స్, మాదాపూర్  
* సొంతింటి ఎంపిక‌కు ఇదే స‌రైన స‌మ‌యం
* మీ క‌ళ్ల ముందే అన్నిర‌కాల ఇంటి ఆప్ష‌న్లు
* ప్రాజెక్టు న‌చ్చితే.. అక్క‌డే గృహ‌రుణం ల‌భ్య‌త 

ఆర్ఈజీ న్యూస్, హైదరాబాద్, 6 అక్టోబర్: హైద‌రాబాద్‌లో ప్రాప‌ర్టీ షో అంటేనే న‌రెడ్కో ప్రాప‌ర్టీ షో అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఎందుకంటే ప‌దిహేనేళ్ల క్రితం.. అంద‌రికంటే ముందుగా.. హైటెక్స్ ను వేదిక‌గా చేసుకుని.. అట్ట‌హాసంగా ప్రాప‌ర్టీ షోను ప్రారంభించి.. గ్రాండ్ స‌క్సెస్ చేసిన ఘ‌న‌త ఈ సంఘానికే ద‌క్కుతుంది. ఎవ‌రూ ఔన‌న్నా.. కాద‌న్నా.. ఇది అక్ష‌రాల స‌త్యం. ఇక అప్ప‌ట్నుంచి ప్ర‌తిఏటా వైవిధ్య‌మైన రీతిలో ప్రాప‌ర్టీ షోను నిర్వ‌హిస్తూ.. కొన్ని వేల‌మంది సొంతింటి క‌ల‌ను సాకారం చేసిన ఘ‌న‌త ఈ న‌రెడ్కోకు ద‌క్కుతుంద‌నే విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. అంత‌టి ఘ‌న‌కీర్తిని సొంతం చేసుకున్న న‌రెడ్కె తెలంగాణ.. తాజాగా అక్టోబ‌రు 10 నుంచి 12 వ‌ర‌కూ హైటెక్స్‌లో ప్రాప‌ర్టీ షోను నిర్వ‌హిస్తోంది. ఎప్ప‌టిలాగే ఈసారీ ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వ్య‌క్తిగ‌త గృహాలు, బ‌హుళ అంత‌స్తుల సముదాయాలు, ఆకాశ‌హ‌ర్మ్యాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు, నిర్మాణ సామ‌గ్రి ఉత్ప‌త్తుల‌కు సంబంధించిన స్టాళ్ల‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాప‌ర్టీ షో ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. అక్క‌డే ప్రాజెక్టును ఎంచుకుని.. బ్యాంకు రుణానికి సంబంధించిన వివ‌రాల్ని కూడా పూర్తి తెలుసుకోవ‌చ్చు. అంటే, ఔత్సాహిక కొనుగోలుదారుల సొంతింటి ఎంపిక‌ను సులభం చేయ‌డంలో న‌రెడ్కో తెలంగాణ ప్రాప‌ర్టీ షో క్రియాశీల‌క పాత్ర పోషిస్తుంద‌న్న‌మాట‌. 


న‌రెడ్కో తెలంగాణ లీడ‌ర్‌షిప్..
15వ ఎడిష‌న్ ప్రాప‌ర్టీ షో సంద‌ర్భంగా న‌రెడ్కో తెలంగాణ అధ్య‌క్షుడు మేకా విజ‌య్ సాయి ఆర్ఈజీ న్యూస్‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ.. మారుతున్న బ‌య్య‌ర్ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా హైద‌రాబాద్‌లో వినూత్న‌మైన ప్రాజెక్టుల నిర్మాణం జ‌రుగుతోందన్నారు. ప్ర‌పంచ పెట్టుబ‌డుల‌కు భాగ్య‌న‌గ‌రం గ‌మ్య‌స్థానంగా మారుతుండ‌టంతో.. ప్ర‌తిఒక్క‌రూ స్థిర నివాసం కోసం కానీ పెట్టుబ‌డి కోణంలో కానీ.. హైద‌రాబాద్‌ను ఎంచుకుంటున్నార‌ని తెలిపారు. రానున్న రోజుల్లో ఇక్క‌డ సొంతిళ్ల‌ను కొనుక్కునేవారి సంఖ్య గ‌ణనీయంగా పెరుగుతుందని అభిప్రాయ‌ప‌డ్డారు. 

* నరెడ్కో తెలంగాణ సెక్రటరీ జనరల్  కె శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘15వ ఎడిషన్ నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోకు విచ్చేస్తే చాలు.. ఎవ‌రి స్థోమ‌త‌కు త‌గ్గ‌ట్టుగా వారు ఇల్లును ఎంచుకోవ‌చ్చ‌ని అన్నారు. పండ‌గ సీజ‌న్‌లో సొంతింటిని కొనుక్కోవాల‌ని భావించేవారికి.. అన్నిర‌కాల ఆప్ష‌న్లు ఈ ప్రాప‌ర్టీ షోలో ల‌భిస్తాయ‌ని తెలిపారు.  

15వ నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో స్పాన్సర్లు


•    పవర్డ్ బై స్పాన్సర్స్     - వాసవి గ్రూప్ మరియు రాంకీ ఎస్టేట్స్ & ఫామ్స్
•    ప్లాటినం స్పాన్సర్      - అన్విత గ్రూప్
•    డైమండ్ స్పాన్సర్      – ఏఎస్‌బీఎల్ 
•     గోల్డ్ స్పాన్సర్లు           – వెర్టెక్స్ హోమ్స్; రాధే గ్రూప్,  రాజపుష్ప ప్రాపర్టీస్
•     సిల్వర్ స్పాన్సర్లు     - అపర్ణ గ్రూప్; సుపధ గ్రూప్,  గ్రీన్ రిచ్ ఎస్టేట్స్
•     బ్రాంజ్ స్పాన్సర్లు     - అర్బన్‌రైజ్ లైఫ్‌స్టైల్; ఆదిత్య కన్‌స్ట్రక్షన్ కంపెనీ; ఈఐపీఎల్‌ గ్రూప్ మరియు అనుహార్ హోమ్స్
•     టోపాజ్ స్పాన్సర్లు     - వజ్ర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్; ప్రణీత డెవలపర్స్; శ్రీ కృష్ణ డెవలపర్స్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ & డెవలపర్స్

రియల్ ఎస్టేట్ కంపెనీలు వివిధ వర్గాల కస్టమర్లకు సరిపోయే అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్లాట్లు వంటి తమ ఆస్తుల శ్రేణిని ప్రదర్శిస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LICHFL), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI), HDFC బ్యాంక్, IDBI బ్యాంక్ వంటి ప్రసిద్ధ ఆర్థిక సంస్థలు తమ గృహ రుణ ఉత్పత్తులను అందిస్తాయి. సరఫరాదారులు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తారు.

నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో 2025
తేదీలు: 2025 అక్టోబర్ 10, 11 మరియు 12 (ప్రవేశం ఉచితం)
సందర్శన వేళలు: ఉదయం 10:00 - రాత్రి 8:00
స్థలం: హాల్ నెం. 4, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్