హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ హకీంపేట్‌లో ప్రతిపాదిత భూమి ఈ-వేలానికి సంబంధించి జూన్ 19న హయత్ ప్లేస్‌లో నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశానికి విశేష స్పందన లభించింది. 50 మందికి పైగా ఆసక్తి గల బిడ్డర్లు సమావేశంలో పాల్గొన్నారు. జేఎల్‌ఎల్ ప్రతినిధులు హైదరాబాద్ అభివృద్ధి అవకాశాలు, స్థలం వ్యూహాత్మక ప్రాధాన్యం, అభివృద్ధి సామర్థ్యంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎంఎస్‌టీసీ అధికారులు ఈ-వేలం ప్రక్రియను వివరించి, పాల్గొనే వారి సందేహాలకు సమాధానాలు అందించారు. సమావేశంలో హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
General