General

దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన స్కై స్క్రేప‌ర్ హ్యాండోవర్‌కు సిద్ధం

దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన స్కై స్క్రేప‌ర్ హ్యాండోవర్‌కు సిద్ధం
కోకాపేట్‌లో సాస్ క్రౌన్‌.. 
ఎత్తు.. 244 మీట‌ర్లు.. 
జి+59 అంత‌స్తులు
దేశంలోనే ఎత్తైన స్కై క్ల‌బ్
హైద‌రాబాద్ నిర్మాణ రంగంలోనే సాస్ క్రౌన్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. ఐదేళ్ల క్రితం ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో.. ద‌క్షిణ భార‌త‌దేశంలోనే అత్యంత ఎత్త‌యిన ఆకాశ‌హ‌ర్మ్యాన్ని నిర్మించడానికి ప్రణాళిక‌ల్ని ర‌చించ‌డ‌మే కాదు.. దాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసి.. సాస్ ఇన్‌ఫ్రా అధినేత జీవీ రావు త‌న స‌త్తాను చాటి చెప్పారు. అంతేకాదు, హైద‌రాబాద్ నిర్మాణ రంగ చ‌రిత్ర‌లో సాస్ క్రౌన్ పేరు సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించగలిగేలా చేశారు. అయితే, ఇదేదో రాత్రికి రాత్రి జ‌రిగిన అద్భుతం కానే కాదు. అర‌వై అంత‌స్తుల ఎత్తు గ‌ల ఆకాశ‌హ‌ర్మ్యాన్ని నిల‌బెట్ట‌డం వెన‌క‌.. జీవీ రావు క‌ఠోర దీక్షా, ప‌ట్టుద‌ల ఉన్నాయి. అందుకే, మేఘాల్ని తాకే ఎత్తులో.. కోకాపేట్‌లో ఎంతో ఠీవీగా నిల‌బ‌డింది.. సాస్ క్రౌన్‌.
ఈ ఆకాశహర్మ్యం కేవ‌లం రెసిడెన్షియ‌ల్ ప్రాజెక్టు మాత్ర‌మే కాదు.. ఇది మహత్తర ఆశయాలకు, అత్యుత్తమ ఇంజినీరింగ్ నైపుణ్యానికి, దూరదృష్టి కలిగిన వాస్తుశిల్పానికి ప్రతీకగా అభివ‌ర్ణించాలి. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యంగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్టు.. ప్ర‌స్తుతం హ్యాండోవర్‌కు సిద్ధమవుతుండగా, రూపకల్పన, నిర్మాణ నైపుణ్యం మరియు అల్ట్రా-లగ్జరీ జీవనశైలిలో ఒక మైలురాయి విజయంగా నిలుస్తోందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.
హైద‌రాబాద్‌లో సొంతింటి ఆనందానికి స‌రికొత్త నిర్వ‌చ‌నాన్ని అంద‌జేసిన సాస్ క్రౌన్‌లో నివ‌సించ‌డ‌మంటే.. కేవలం ఒక అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకోవడమే కాదు, జీవితాన్ని స‌రికొత్త కోణంలో అనుభవించే ప్రయాణాన్ని సృష్టిస్తుంద‌ని చెప్పొచ్చు.
దూరదృష్టి కలిగిన వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్త‌లు మరియు ప్రపంచస్థాయి నిపుణుల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న సాస్ క్రౌన్‌.. సాధారణ ప్రమాణాల కంటే భిన్నమైన జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. దాని అద్భుతమైన ఎత్తు, విశాలమైన నివాసాలు, ప్రపంచస్థాయి సౌకర్యాలు మరియు నగర స్కైలైన్‌ను ఆవిష్కరించే విస్తృత దృశ్యాలు వంటివి భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నివాస చిరునామాల్లో ఒకటిగా నిలుస్తుంది
ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యుత్త‌మైన నిర్మాణ నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో.. వ‌ర్టిక‌ల్ ట‌వ‌ర్ నిర్మాణ స‌వాళ్ల‌ను స‌మ‌ర్థంగా అధిగ‌మిస్తూ.. ఐదేసి ట‌వ‌ర్ల మ‌ధ్య కచ్చిత‌మైన ప్ర‌ణాళిక మ‌రియు స‌మ‌న్వ‌యంతో రూపుదిద్దుకున్న ప్రాజెక్టే.. సాస్ క్రౌన్‌. నిర్మాణరంగంలో ఎదురయ్యే అనేక స‌వాళ్ల‌ను అధిగ‌మిస్తూ.. ఈ ప్రాజెక్టు బృందం నాణ్యత విషయంలో ఎక్క‌డా రాజీ పడకుండా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. ఈ క్రమంలో అత్యుత్త‌మ నిర్మాణ  సామ‌గ్రిని వినియోగించింది. 
సుమారు 244 మీటర్ల ఎత్తులో.. ఆకాశాన్ని చుంబించేలా ద‌ర్శ‌న‌మిచ్చే.. ఐదు ప్రతిష్ఠాత్మక టవర్లతో సాస్ క్రౌన్‌ కేవలం హైదరాబాద్ స్కైలైన్‌ను మార్చడం మాత్రమే కాదు.. దూరదృష్టి, ఇంజినీరింగ్ సామర్థ్యం మరియు అత్యుత్తమ నిర్మాణ నైపుణ్యం క‌లిస్తే.. ఎలాంటి అద్భుతం సాధ్య‌మ‌వుతుందో నిరూపించే  ఉదాహరణ అని చెప్పొచ్చు.
ఐదు ఐకానిక్ ట‌వ‌ర్లు, ఒక్కో ట‌వ‌ర్ ఎత్తు: 60 అంత‌స్తులు హైదరాబాద్ సిటీ అందాల్ని వీక్షించేందుకు అద్భుత‌మైన అవ‌కాశం
* ప్రైవ‌సీ మ‌రియు ప్ర‌త్యేక అనుభ‌వం
* లో డెన్సిటీ ల‌గ్జ‌రీ లివింగ్ అనుభ‌వం
* ట‌వ‌ర్ల విభ‌జ‌నలో ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌..
* ప్ర‌శాంత‌త మ‌రియు వ్య‌క్తిగ‌త రెసిడెన్షియ‌ల్ వాతావ‌ర‌ణం
* ప్ర‌త్యేక‌త‌ను కోరుకునేవారికి రూపొందించిన ఆకాశ‌హ‌ర్మ్యం
* కామ‌న్ వాల్స్ లేని స‌రికొత్త స్కైలైన్‌ను ఆస్వాదించండి  భార‌త‌దేశంలోనే ఎత్త‌యిన స్కై క్ల‌బ్
* మ‌న‌దేశంలో ప్ర‌త్యేక‌మైన  స్కై హై జీవ‌నానికి స‌రికొత్త చిరునామా
* అత్య‌ద్భుత‌మైన న‌గ‌ర అందాల్ని వీక్షించే మంచి అవ‌కాశం
* అత్యుత్తమ ఆతిథ్యాన్ని ప్రతిబింబించే లగ్జరీ అనుభవాలు
* ప్రతి గదిలో సీలింగ్ ఎత్తు.. 13 అడుగులుగ్రాండ్‌నెస్ మరియు విశాలతను అందిస్తుంది. ఒకే ర‌క‌మైన అభిరుచులు మరియు ఆకాంక్షలు కలిగిన వ్యక్తులతో కూడిన కమ్యూనిటీని చూడటం చాలా అరుదు. ఆ అరుదైన స్థాయిని ప్రతిబింబించే కమ్యూనిటీలలో సాస్ క్రౌన్ ఒకటి.